లెజెండరీ మాస్ట్రో ఇళయరాజాను కలసిన ‘కస్టడీ’ టీమ్!

Custody Team Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, meets Isaignani and Legendary Maestro Ilaiyaraaja
Spread the love

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదీలావుండగా లెజెండరీ కంపోజర్ ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా “రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్” కోసం హైదరాబాద్‌ కి వచ్చారు. కస్టడీ యూనిట్ లెజెండ్ ఇళయరాజాను కలుసుకుని అభినందించింది. నాగ చైతన్య ఫోటోలని పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని పంచుకున్నారు. “మాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలవడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వినుకుంటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను. ఇప్పుడు రాజా సర్ ‘కస్టడీ’ చిత్రం కోసం కంపోజ్ చేయడం చాలా అనందంగా వుంది.”అన్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు.
సాంకేతిక విభాగం : కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్, ఎడిటర్: వెంకట్ రాజన్, డైలాగ్స్: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, యాక్షన్: మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ, పీఆర్వో: వంశీ శేఖర్, మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట.

Related posts

Leave a Comment