ఐజేయూ నేతతో ఛత్తీస్ గఢ్ జర్నలిస్ట్స్ ప్రతినిధి బృందం భేటి : రాష్ట్రం పర్యటించాలని విన్నపం

-రాష్ట్రం పర్యటించాలని విన్నపం
Spread the love

తమ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చేయూత నివ్వాలని స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ ప్రతినిధి బృందం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)ను విజ్ఞప్తి చేసింది.
ఐదుగురితో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం నాడు హైదరాబాద్ పర్యటించి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డిని కలుసుకుంది. ఈ సందర్భంగా లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు తదితర అంశాలను ప్రతినిధి బృందం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐజేయూ కొనసాగిస్తున్న రాజీలేని పోరాటాలకు తాము ఆకర్షితులైనట్లు వారు స్పష్టం చేశారు. ఐజేయూ ప్రతినిధి బృందం తమ రాష్ట్రాన్ని పర్యటించి, జర్నలిస్టుల సమస్యలను అధ్యాయనం చేసి వాటి పరిష్కారానికి తమకు చేయుతనందించాలని వారు విజ్ఞప్తి చేసారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ త్వరలో ఉత్తరాఖండ్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించి ప్రతినిధి బృందాన్ని ఛత్తీస్ గఢ్ పంపించే ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. ఇవ్వాళ హైదరాబాద్ పర్యటించిన ప్రతినిధి బృందంలో స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు పి.సి.రత్ (రాయిపూర్), సుధీర్ తంబోలి(రాయిపూర్), శివసారథి(రాయిపూర్), ప్రమోద్ పొటై(బస్తర్), డి.ఎస్.కుమార్(బిలై)లతో పాటు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment