దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.., అందమైన కుందానాల బొమ్మరా.., రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా.., పండు వెన్నెల్లో ఈ వెనుగానం అంటూ వచ్చిన పాటలు ఇప్పటికి వినిపిస్తున్నాయంటే ఆ పాటలు ప్రేక్షకుల్నిఎంతగా అలరించియో ఇట్టే అర్ధమవుతోంది. ప్రేక్షకుల మనస్సులో బలంగా నాటుకుపోయిన విధానం అంతా ఇంతా కాదు. ఇవొక్కటే కాదు.. సంపంగి, 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రీ రామచంద్రులు, ప్రేమలో పావనీ కళ్యాణ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, అవతారం, వైఫ్, అందాల ఓ చిలుక వంటి సినిమాలకు మ్యూజికల్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాతో సంబంధం లేకుండా ఆడియో సూపర్‌హిట్ చేయ్యటమే కాకుండా, ఆ పాటలు అందరూ పాడకునేలా సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ. ‘జికే ఈజ్ బ్యాక్’ అన్నట్టు తాజాగా డిసెంబర్ 9న విడుదలైన ‘లెహరాయి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మళ్ళీ మెస్మరైజ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ తో రివ్వున ఎగిరే గువ్వాలా మన ముందుకు వచ్చారు.
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్.ఎల్.ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ‘ధర్మపురి’ ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంసని దర్శకుడిగా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన ‘లెహరాయి’ చిత్రంలో మంచి ఫీల్ వున్న ఏడు పాటలు ఉండడం విశేషం. ఈ చిత్రం విడుదలకు ముందు వచ్చిన ”గుప్పెడంత..”,“బేబీ ఒసేయ్ బేబీ..”, ”అప్సర అప్సర..”, ”చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ..”, ”ప్రేమ ఊబిలో మునిగి నిన్ను మరచి పోయా..” వంటి పాటలు మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణతో ‘టాలీవుడ్ టైమ్స్’ ఇంటర్వ్యూ…
# ‘లెహరాయి’ సినిమా పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
– చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కు ఒక ప్రత్యేకత ఉంది. ‘సంపంగి’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత పేరు వచ్చిందో ఈ ‘లెహరాయి’ సినిమా మ్యూజిక్ కు అంతే పేరు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం బిగినింగ్ నుంచి కథ విని ఎలా చేయాలి?, ఎలా చేస్తే బాగుంటుంది? అని టీంతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ అన్ని రకాలుగా సెట్ అయిన సినిమానే ఈ “లెహరాయి”. అయితే ‘సంపంగి’ సినిమాని గుర్తుకు తెచ్చేలా ఈ సినిమా పాటలు అద్భుతంగా కుదిరాయి, పాటలతో పాటు మంచి కథ కూడా కుదరడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
# ఒక టైమ్ లో మీ పాటలు యూత్ కు మంచి ‘కిక్’ ఇచ్చేవి.. అయితే మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు?
– గ్యాప్ అనేది కెరియర్లో కూడా భాగమే.. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఒక హిట్ వస్తే రెండు సినిమాలు ఫెయిల్ కావడం జరిగేది. దాంతో నా కెరీర్ గ్రాఫ్ పెరగలేదు. ఏదైనా ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తే ప్రేక్షకులకు ఆ పాటలు ఎప్పుడూ గుర్తుండి పోవాలని కోరుకునేవాడిని. దాంతో ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ గ్యాప్ తీసుకున్నాను.
# ఒకప్పుడు ‘సంపంగి’ వంటి పాటలు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. మళ్ళీ ఆ తరహా పాటలు మీ ద్వారా చూడొచ్చా?
– తప్పకుండా చూడొచ్చు. ఇప్పుడు వచ్చిన ‘లెహరాయి’ పాటలు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో పాటు తరువాత రాబోయే నా సినిమాలు కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అవుతాయి. అయితే ‘సంపంగి’ సినిమా హిందూ ముస్లింల మధ్య సాగే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆ సినిమాలాగే ఇందులో కూడా ప్రస్తుతం లవ్ చేసుకుంటున్న వారిలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అలా ఎందుకు జరుగుతుంది? అనేది తెలుపుతూ లవ్ తో పాటు ఇంటర్నల్ గా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ‘లెహరాయి’ పాటలు ‘సంపంగి’ సినిమా పాటల కంటే ఒక మెట్టు పైన ఉండేలా ఉండి ప్రేక్షకులకు చేరువయ్యాయి.
# ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. అయితే మీ స్ట్రెంత్ వచ్చేసి లవ్ సాంగ్స్ బాగా చేస్తారు అని ఉంది. ఈ ‘లెహరాయి’ మీకు పర్ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చా?
– ‘లెహరాయి’ అంటే ఒక గాలి కెరటం. ఒక ఇంద్రధనస్సుకున్న ఏడు రంగులులాగే ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. లవ్, సెంటిమెంటు, మాస్ ఇలా ఏడు రకాలుగా ఈ సినిమాలో పాటలు ఉంటాయి. ఈ సినిమాకు ఇంత మంచి ఆల్బం రావడానికి ముఖ్య కారణం నిర్మాతలు. సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలని చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, హరిచరణ్, జెస్సి గిప్టన్, సన్నీ హిందూస్థానీ, సాకేత్, రేవంత్ వంటి మెయిన్ సింగర్స్ అంతా కూడా ఈ సినిమాలో పాటలు పాడడం జరిగింది. అలాగే రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి ఇలా పాటల రచయితలు.. ఇలా మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాకు ఇంత మంచి ఆల్బం వచ్చిందంటే దీనికంతటికీ వీరే కారణం కాబట్టి ఈ ‘లెహరాయి’ సినిమా నాకు ఫర్ ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చు.
# ‘లెహరాయి’ చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్పండి?
– సాధారణంగా సీనియర్ యాక్టర్స్ ను డీల్ చేయడం అంటే చాలా కష్టం. దర్శకుడు రామకృష్ణ కొత్త వాడైనా చాలా చక్కగా చేశాడు. రావు రమేష్, సీనియర్ నరేష్, ఆలీ, సత్యం రాజేష్ ఇలా పెద్ద ఆర్టిస్టులను డీల్ చేయడం అంటే ఈజీ కాదు. కానీ దర్శకుడు ఇది కావాలి అనేది చెప్పకనే చెప్తూ అందరితో కలసిపోయి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరితో చాలా బాగా చేయించుకున్నాడు. దాంతో నాకు చాలా ఈజీ అయింది. ఈ పాట ఇలానే ఉండాలని కన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ గా కథనం ప్రకారం గా ప్రతి సన్నివేశానికి దగ్గరగా ఉండేలా చేయించుకున్నాడు.
# ‘లెహరాయి’ చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ గురించి చెప్పండి?
– నిర్మాత మద్ది రెడ్డి శ్రీనివాస్ సినిమాను పరిపూర్ణంగా చేయించుకున్నాడు. సినిమాలో మంచి క్వాలిటీ ఉండాలని మమ్మల్ని బాగా చూసుకున్నాడు. యూనిట్లో జరిగే ప్రతి ఒక్క పనిని దగ్గర ఉండి చూసుకున్నాడు. తను అలా చేయడం వల్ల చక్కటి అవుట్ పుట్ వచ్చింది.
# ప్రతి ఒక్కరూ సిద్ శ్రీ రాం తో పాడించి హిట్ కొడుతున్నారు. ఈ సినిమాలో సిద్ శ్రీ రాం పాడిన పాటకు రెస్పాన్స్ ఎలా ఉంది?
– ‘లెహరాయి’ అంటే కెరటం, సిద్ శ్రీ రాం కూడా తన పాటలతో కెరటంలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతి ఒక్కరూ కోటి రూపాయలతో సినిమా తీసినా హిట్ కోసమే,100 కోట్లు పెట్టినా హిట్ కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాలో కథతో పాటు మ్యూజిక్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే సిద్ శ్రీ రాం చేసిన వరుస 10 సినిమాలు హిట్ సినిమాలే. ఈ సినిమాలో కూడా కథతో పాటు పాటలు అన్ని చక్కగా కుదిరాయి.
# ఈ సినిమా రీ రికార్డింగ్ చూసినపుడు మీరు సినిమా చూసి ఉంటారు కదా.. సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చింది?
– రావు రమేష్, సీనియర్ నరేష్, ఆలీ, సత్యం రాజేష్ వంటి సీనియర్ నటులు చాలా చక్కగా నటించారు. ఈ సినిమా కథ చాలా బాగుంది. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే నాకు మాత్రం ‘సంపంగి’ లాంటి సినిమానే మళ్లీ వచ్చిందని నేను నమ్ముతున్నాను.
# కాలం మారే కొద్ది మ్యూజిక్ కూడా మారుతుంది కాబట్టి.. మీరు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అప్పటికీ ఇప్పటికి సంగీతంలో మీరు గమనించిన తేడాలు ఏంటి ?
– మ్యూజిక్ లో ఎలాంటి తేడా ఉండదు కానీ, కాకపొతే బీట్ ఓరియెంటెడ్ అయ్యారు అంటే రిధంను ఎక్కువ మింగిలి చేస్తూ చిన్నచిన్న టెక్నక్స్ తో ఆటో ట్యూన్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మిక్సింగ్ లో కూడా క్రిస్టల్ క్లియర్ ఉండేలా చేయడం జరుగుతుంది. అప్పట్లో సాహిత్యం బాగా వినపడేది అయితే మధ్యలో మ్యూజిక్ హోరు ఎక్కువై సాహిత్యం బాగా డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు మంచి మంచి సింగర్స్ రావడం వలన పాత తరం సాహిత్యానికి ప్రేక్షకులు ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారని చెప్పవచ్చు.
# ‘లెహరాయి’ సినిమా ద్వారా ఆడియన్స్ కు మీరు ఏం చెప్పారు?
– ఒకప్పుడు నేను మ్యూజిక్ చేసిన ‘సంపంగి’ సినిమాను చూసి ఎలా ఆదరించారో.. ఇప్పుడు వస్తున్న ‘లెహరాయి’ సినిమా కూడా అంతకంటే కంటే పెద్ద రేంజ్ లో హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకున్నాను. ఈ సినిమాలో అన్ని వర్గాల వారికి అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి హృదయాలను కచ్చితంగా తాకింది.
# చివరగా మీరు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు?
– పెద్దగా నాకు ఆశలంటూ ఏమీలేవు కానీ.. ‘దేవుడు వరమందిస్తే..’ ఈ సంగీత ప్రపంచంలో ‘రివ్వున ఎగిరే గువ్వాలా..’ పరుగులు పెట్టాలనుంది
అంటూ ముగించారు సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ (జీకే).
ఆల్ ది బెస్ట్ ఘంటాడి కృష్ణ!!