సుమన్ కు కాంతారావు శతజయంతి పురస్కారం

hero sumanku kantharao jaathiya puraskaram
Spread the love

అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయం లోనే వారికి ధీటుగా ప్రముఖ హీరో గా కాంతారావు నిలబడ్డారు అన్నారు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ.
శనివారం, జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకోనున్నట్టు తెలిపారు. హీరోగా నిలదొక్కుకున్న తదనంతరం ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్నప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. కాంతారావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ ‘సుందరీ సుబ్బారావు’ లో ఆయన కు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పి.సి.ఆదిత్య మాట్లాడుతూ, కాంతారావు బయోపిక్ చేస్తున్నట్టు.. ఈ విషయమై వారి స్వ గ్రా మం కోదాడ మండలం గుదిబండకు వెళ్లి వచ్చినట్టు వివరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో ఫిక్కీ సి. ఎం.డి అచ్యుత జగదీష్ చంద్ర, కాంతారావు కుమారుడు నటుడు రాజాతో పాటు, పలువురు సినీ పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment