స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!
Spread the love

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో పాటు 75 పతాకాలను విద్యార్థులు చేతబూని పట్టణ వీథుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బండిరాజుల శంకర్ మాట్లాడుతూ ఎందరో వీరులు ప్రాణాలర్పించి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని తిరిగి కోల్పోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో జయమ్మ, భిక్షపతి, పరమేశ్వరి, వాణిశ్రీ,, అన్నపూర్ణ, శ్రీధర్, భీమేశ్, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment