జూన్ 20న ‘8 వసంతాలు’ విడుదల

'8 Vasanthalu' to release on June 20
Spread the love

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని,వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని ప్రోమోలు ప్రామిస్ చేశాయి. మేకర్స్ ఈ మాన్సూన్ సీజన్‌లో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ మరో మూడు వారాలలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనంతిక సనీల్‌కుమార్ బ్యూటీఫుల్ గా వున్నారు. అద్భుతమైన చీరలో ఆమె ప్లజెంట్ గా కనిపించారు. ఆమె జుట్టులో గులాబీ ఆమె లుక్‌, క్యారెక్టర్ నేచర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. వరుస మ్యూజికల్ హిట్స్ ని అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ రెడ్డి డీఓపీ గా వర్క్ చేస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్‌ను, శశాంక్ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్స్ తో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్, సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సీఈఓ : చెర్రీ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్, ఎడిటర్: శశాంక్ మాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి, పీఆర్వో: వంశీ-శేఖర్, మార్కెటింగ్: ఫస్ట్ షో

Related posts

Leave a Comment