తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీటీపీఓఏ), జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 10 న ఉస్మానియా యూనివర్సిటీలోని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెగా జాబ్ మేళా–2026” నిర్వహించనుంది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా జాబ్ మేళా కు సంబంధించిన గోడ పత్రికను డా. ఎంజీ రామచంద్రన్, జీవీకే, అజయ్ కుమార్, ఎం.రాజు లతో కలసి టీటీపీఓఏ అధ్యక్షుడు డా. జయరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నియామక ప్రక్రియలో ప్రముఖ బహుళజాతి సంస్థలతో సహా 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ లేదా…
Day: July 6, 2026
మలయాళీ కవి కె. సచ్చిదానందన్ కు సినారె ‘విశ్వంభర’ జాతీయ పురస్కారం
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి స్మృత్యర్థం శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ప్రదానం చేసే విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ మలయాళీ కవి కె. సచ్చిదానందన్ ను ఎంపిక చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్ సి.నారాయణరెడ్డి 95వ జయంత్యుత్సవంలో సచ్చిదానందన్ ను 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక,ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు ట్రస్టు అధ్యక్షులు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక మలయాళ కవులలో అగ్రశ్రేణికి చెందిన సచ్చిదానందన్ కవిగా, సాహిత్య విమర్శకునిగా, నాటక కర్తగా, సంపాదకునిగా, కాలమిస్టుగా, అనువాదకునిగా ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బహుముఖీన సేవలు అందించారు. ఆయన కవితలు మలయాళం ఇతర భారతీయ భాషల్లో 18 సంపుటాలుగా వెలువడ్డాయి.…
