ప్రముఖ న‌టులు, నిర్మాత‌ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌, ఫిబ్రవరి 13న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్

Teaser of "Amaravathiki Aahwanam" Released by Veteran Actor & Producer Murali Mohan Garu Worldwide Theatrical Release on February 13th

శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత – నటులు మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో… నటుడు అశోక్…