శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు.…
