మెగాస్టార్ కెరీర్ లోనే సరికొత్త రికార్డ్!

A new record in the megastar's career!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని ప్రాంతాలలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. 6వ రోజు ముగిసే నాటికి, ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇప్పుడు రూ. 300 కోట్ల మార్కు చేరువలో ఉంది. ముఖ్యంగా “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం యూఎస్ఏ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. గతంలో చిరంజీవి అత్యుత్తమ ఓవర్సీస్ చిత్రంగా నిలిచిన ‘సైరా నరసింహారెడ్డి’ (2.7 మిలియన్లు) రికార్డ్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అధిగమించింది. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్…

అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ విడుదల

‘Aataadina Paata’ Title Launched Grandly in the USA

నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ సన్నిహిత మాటలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన జయంత్ చల్లా గారికి, అలాగే నాగేశ్వర్ రావు పూజారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ…