తెలుగు చిత్రసీమలో నటుడిగా పందొమ్మిదేళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న శ్రీనందుకు ఒక్కటంటే ఒక్కటి హిట్టు దొరక్క ఎంతగానో తపించి పోయాడు. ఇప్పటివరకు సరైన ప్రాజెక్ట్ పడక.. హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అందుకే తనను తాను అప్డేట్ చేసుకుని, హీరోగా నటిస్తూనే స్వీయ నిర్మాణంలో డార్క్ కామెడీ డ్రామాతో ‘సైక్ సిద్ధార్థ’ను నిర్మించాడు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినిమాకు విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాల దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాకుండా సహ రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించడంతో హిట్టు కోసం నందు పడ్డ కసి కనిపించింది. న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా, చాలా సింపుల్ కథను గట్టిగా, క్విర్కీగా, కొంచెం సైకో టోన్‌లో చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు…
