ఉత్తమ చిత్రం: ‘కోర్ట్’ , ఉత్తమ హీరో : అఖిల్ రాజ్ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ హీరోయిన్ : తేజస్వీరావు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ దర్శకుడు : సాయిలు కంపాటి చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరపున అవార్డులను బహుకరించనున్నట్లు అధ్యక్షుడు కె.ఎస్.రామారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ…ఈ ఏడాది పది కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన చిన్న సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 31న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో విడుదలైన ‘కోర్ట్’ను ఉత్తమ చిత్రంగాను, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నుంచి అఖిల్ రాజ్ ను ఉత్తమ హీరోగాను, ఉత్తమ హీరోయిన్ గా తేజస్వీరావు, ఉత్తమ…
Day: December 26, 2025
కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను…
‘ఛాంపియన్’ సక్సెస్ గొప్ప ఆనందాన్నిచ్చింది : నిర్మాత స్వప్న దత్
స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఛాంపియన్’. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో రోషన్ మాట్లాడుతూ.. ‘ఛాంపియన్’ నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్ సినిమా కోసం ఏమైనా చేస్తుంది. కిరణ్ గారికి థాంక్యూ, అలాగే జీకే గారికి, మా నిర్మాతలు…
‘దండోరా’ సక్సెస్ సెలబ్రేషన్స్
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ సక్సెస్ మీట్‌లో… శివాజీ మాట్లాడుతూ ..హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయటానికి వచ్చారు. నీలకంఠగారైతే తరాలకొకసారే ఇలాంటి సినిమా వస్తుందని అన్నారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలో…
చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ వైపే ఉన్నాం
* గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే… ఆదివారం ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమలో ఛాంబర్ లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28న జరుగుతున్న సందర్భంగా మన బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చదలవాడ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు, ఎలాంటి రెస్పాన్స్ రోజుల తరబడి ఇవ్వకుండా తిప్పించారు. నిజానికి గిల్డ్ సభ్యులే చిత్రీకరణలు ఆపారు. వారు స్వార్దం గా వ్యవహరించారు. ఛాంబర్ సభ్యుల పేరిట సిఎంలతో ఫోటోలు దిగాలనే ఆలోచన తప్ప, చిత్ర పరిశ్రమ బాగు…
