శ్రీమతి. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ‘లవ్ ఓటీపీ’కి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ఈవెంట్‌లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో…