హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గుంటి నగేష్ కోరారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటి నాగేష్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజి ప్రజా సేవకే జీవితం అంకితం చేశారని, ఆయన జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాపూజీ కృషి చేశారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ దాసు…
