బ్యూటిఫుల్ పోస్టర్ తో ‘ఓజి’ సెకండ్ సింగిల్ అప్డేట్..

'OG' second single update with beautiful poster..

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ చిత్రం నుంచి ఇప్పటికే ఫైర్ స్టార్మ్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజి స్లొగన్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ కథాంశంతో నటిస్తుండడం కూడా ఓజిపై క్రేజ్ పెంచేసింది. టీజర్, ఫస్ట్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి.…