సాంస్కృతిక సారథులకు దిశ దశ ఏది? .. జీతాలు లేవు.. కార్యక్రమాలు లేవు!

What is the direction for cultural leaders? .. No salaries.. No programs!

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కెసిఆర్ సంకల్పించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. సాంస్కృతిక సారధి అని ఆ సంస్థకు నామకరణం చేసి సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో కార్యాలయం కేటాయించారు. కెసిఆర్ హయాంలో రెండు పర్యాయాలు అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే ఉద్యమ గాయకుడు రసమయి బాలకిషన్ ను చైర్మన్ గా నియమించారు. సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ వ్యవహరించే వారు. 550 మంది కళాకారులకు ఉద్యోగ కల్పన చేశారు. ఒక్కొక్కరికి 25,500 రూపాయలు నెల జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం, అధికారిక బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ అధికారిక ఉత్సవాలు, పండుగల్లో కళా…