టీ ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ టైటిల్ & గ్లింప్స్ విడుదల – సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు ముడిపడిన ఆసక్తికర కంటెంట్

TR Dream Productions Title & Glimpse Release – Interesting Content Tied to Suspense Crime Thriller

టీ ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘C-మంతం’ నుంచి గ్లింప్స్‌ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. క్లాసిక్ థ్రిల్, ఎమోషనల్ డెప్త్ కలగలిసినట్లుగా కనిపించే ఈ గ్లింప్స్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రేగ్నెంట్ మహిళ చేతులు వెనక్కి కట్టిన దృశ్యం, రక్తపు మడుగులు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే చర్యలు. దర్శకుడు సుధాకర్ పాణి ఈ సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించినట్టు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ గ్లింప్స్‌కు బలాన్ని చేకూర్చింది. చిత్ర బృందం ప్రకారం, మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలు…