ఘనంగా ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ లాంఛ్..ఆగస్టు 8న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

'Raju Gani Saavaal' trailer launch in grand style..Grand theatrical release on August 8th

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం, ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హీరోయిన్ డింపుల్…