తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్క్షతలు తెలియజేయగానికి ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ ఐఏఎస్‌లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ గారు మాట్లాడుతూ ”గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో.. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారి ఓవరాల్ సూపర్‌విజన్‌లో సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్ వేడుకకు సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు నా కృతజ్క్షతలు అని తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ ” తెలంగాణ…
Day: June 15, 2025
చూడముచ్చటైన సినీ సంబరం!
* ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ ప్రధానోత్సవం ..ఓ విశ్లేషణ * సినీ తారలతో దద్దరిల్లిన హైటెక్స్ ప్రాంగణం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది. ఈ తెలుగు సినిమా అవార్డ్స్ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్ ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను చిత్రసీమ మరోసారి అభినందించింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో…