సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు, భవిష్య ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం…