దసరా సందర్భంగా పలు సినిమాల టీజర్‌లు విడుదలయ్యాయి. ఇందులో మెగాస్టార్ ‘విశ్వంభర’ ముందుంటుంది. విర్రవీగుతున్న అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధం ఏ రూపంలో వచ్చిందో తెలియాలంటే ‘విశ్వంభర’ చూడాల్సిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. కునాల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. విక్రమ్ రెడ్డి సమర్పకులు. ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది’ అంటూ మొదలయ్యే టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశారు. సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న చిత్రమిది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలని, రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేశారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా…
Month: October 2024
The buzz of star hero movies. Teasers and posters release on Dussehra
Teasers of many movies were released on the occasion of Dussehra. Megastar ‘Vishwambhara’ is leading in this. One has to watch ‘Vishwambhara’ to know in what form the great war that ended the raging anarchy came. Chiranjeevi is playing the lead role in this film. Trisha and Aashika Ranganath are the heroines. Kunal Kapoor is playing the lead role. Vashishtha is the director. Producers are Vamsi and Pramod Uppalapati under UV Creations banner. Presented by Vikram Reddy. The teaser of this movie was released on the occasion of Dussehra. ‘Just…
కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానంటోంది రకుల్ ప్రీత్ సింగ్
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పిన రకుల్.. గతంలో ప్రభాస్ సినిమా నుంచి తనను తొలగించడం గురించి మరోసారి మాట్లాడారు. ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. ”ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్ కోసం ఎన్ని రోజులైనా ఫోన్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు. అప్పటికే ప్రభాస్- కాజల్‌ల కాంబినేషన్‌లో…
Despite facing many ups and downs in the beginning of her career: Rakul Preet Singh
Actress Rakul Preet Singh came to the industry without any film background and got recognition. Rakul, who said that she missed many opportunities in the beginning of her career, once again talked about Prabhas removing her from the film. In an interview given to English Vudia, Prabhas revealed that he has taken Kajal in his place in the film. “I got an opportunity in a film opposite Prabhas. A schedule was also drawn. Then I was studying in Delhi. After completing the schedule, I went back to Delhi. After going…
‘కంగువా’ డబ్బింగ్‌లో ఏఐ ఉపయోగం : నిర్మాత కే.ఈ జ్ఞానవేల్
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ శివ దర్శకత్వంలో రూపొందుతుంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు. ‘కంగువా’ను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్మాత ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తి చేయనున్నాం. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం.…
Use of AI in the dubbing of ‘Kangua’: Producer KE Gnanavel reveals
The film ‘Kangua’ starring Surya in the lead role will be directed by Siva. It will release worldwide on November 14. Producer KE Gnanavel shared an interesting thing about this film which is shaping up as a fantasy action film. He recently interacted with the netizens at the X platform and said that he used AI in ‘Kangua’. It is known that ‘Kangua’ will be released simultaneously in 8 languages. The producer shared a thing related to this. While Surya said dubbing for the Tamil version, we will complete the…
దర్శకుడు వి. సముద్ర వారసులు అరున్ మహా శివ-రామ్ త్రివిక్రమ్ హీరోలుగా “దో కమీనే” సినిమా ప్రారంభం
“షోలే”, “ఆర్ఆర్ఆర్” తరహా వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో రూపొందనున్న “దో కమీనే” టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర వారసులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా “దో కమీనే” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. “షోలే”, “ఆర్ఆర్ఆర్” కలిపితే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యాక్టర్స్ శ్రీకాంత్, సుమన్, దర్శకులు బి గోపాల్, ఎఎస్ రవికుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్ క్లాప్ నివ్వగా బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించారు,…
విజయదశమి సందర్భంగా డియర్ కృష్ణ మూవీ పోస్టర్ లాంచ్
పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథకు దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే నమ్మే ఒక భక్తుడు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఒక మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ…
vishvam movie review in telgugu : గోపీచంద్.. ‘విశ్వం’ లో కనిపించని కొత్తదనం
హీరో గోపీచంద్.. దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రమంలో… ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా ‘విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథేంటంటే.. జలాలుద్దీన్ ఖురేషి (జిషు సేన్) కరుడుగట్టిన ఐఎస్‌ఐ టెర్రరిస్ట్. సంజయ్ శర్మ అనే మారుపేరుతో భారత్‌లో నివసిస్తూ.. విద్యా వ్యవస్థ ముసుగులో విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. వాళ్ల సాయంతో పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించి భారత్‌ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తుంటాడు. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్) సోదరుడైన బాచిరాజు (సునీల్) సాయం తీసుకుంటాడు. కానీ, తన ఉగ్రచర్యల సంగతి సీతారామరాజుకు తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని జలాలుద్దీన్ కిరాతకంగా చంపేస్తాడు. ఈ హత్యను దర్శన అనే ఓ చిన్న పాప…
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ పై రష్మిక ప్రశంసలు..
‘జిగ్రా’లో నటన అమోఘం అంటూ కితాబు! బాలీవుడ్ నటి అలియాభట్ పై నటి రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. యాక్టింగ్‌లో అలియా టాలెంట్, కథల ఎంపికను ఆమె మెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను తరచూ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలియా భట్, వేదాంగ్ నటించిన ‘జిగ్రా’ చూశా. సినిమా అద్భుతంగా ఉంది. నటీనటులు, చిత్రబృందాన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్యూ. వేదాంగ్ నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. రాహుల్.. నువ్వు నన్నెంతో సర్‌ప్రైజ్ చేశావు. నీకు, ’జిగ్రా’లో నువ్వు పోషించిన మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్ బాలా.. మేకింగ్ చాలా బాగుంది. ఇంకెన్నో…
