బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా… వెండితెరపై చూసినా…. కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ఆడియన్స్ ను ఏమాత్ర ఆకట్టుకున్నారో చూద్దాం పదండి. కథ: మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన…