తెలుగు సినిమాలతో పాటు… హిందీ సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహిస్తూ… ప్రతి చిత్రంతో సంగీత దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ తాజాగా “అయోధ్య శ్రీరామ్” ఆల్బమ్ కు సారధ్యం వహించారు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా… హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ గీతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అతి త్వరలో సినీ రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ప్రవాస భారతీయులు సమీర్ పెనకలపాటి ఈ రామ గీతాన్ని ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి ప్రపత్తులతో రూపొందించారు. ఈ గీతానికి లభిస్తున్న అపూర్వ స్పందనపై సంగీత సారధి సత్య కశ్యప్ సంతోషంతో తబ్బిబ్బు అవుతున్నారు. సంగీత దర్శకుడిగా తన జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నానని ఎంతో ఉద్వేగానికి…
Day: February 6, 2024
తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’ : దర్శకుడు మహి వీ రాఘవ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ…