ఉలగనాయగన్ కమల్ హాసన్ మరో సినిమాకు సైన్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘విక్రమ్’ సినిమా కమల్ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్ స్టార్.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ ’థగ్ లైఫ్’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. ’ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్ రాజ్ కమల్…
Month: January 2024
సైంధవ్: విక్టరీ వన్ మ్యాన్ షో!
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా శనివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి బరిలోకి ‘సైంధవ్’ని దింపారు. ట్రైలర్‌లోనే స్టోరీ మొత్తం చెప్పేసినా.. సినిమా వెంకీ కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెప్పుకునే కంటెంట్ ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. శైలేష్ చెప్పినట్లే.. ఈ సినిమాలో కంటెంట్ బాగుందని, వెంకటేష్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రం అవుతుందని.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ‘సైంధవ్’ రివ్యూస్ డిఫరెంట్‌గా చూపారు. వెంకీమామ ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే.. ‘సైంధవ్’…
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ‘కల్కి’ విడుదల తేదీ ఖరారు!
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్న ‘కల్కి 2898’ సినిమా విడుదలపై స్పష్టత వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని…
బిజెపికి విక్రమ్ గౌడ్ రాజీనామా..త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!
హైదరాబాద్ : ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్…
విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’!
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమైన సినిమా ‘సర్కారు నౌకరి’ సినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకున్న ఈ సినిమా.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఆకాష్ సరసన భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో జనవరి 12 నుండి ఈ సినిమా స్ట్రీమిగ్ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం, థియేటర్లు అన్ని పెద్ద సినిమాలకే బుక్కయిపోవడంతో.. మేకర్స్ ఈ సినిమాని ఓటీటీలోకి వదిలేశారు. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటున్నట్లుగా…
హనుమాన్ : మన సూపర్ మేన్ కథ!
అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) వుంటారు. హనుమంతు ఆ వూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్నచిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ వూరికి హనుమంతు చిన్నప్పటి స్నేహితురాలు విూనాక్షి (అమృత అయ్యర్) డాక్టర్ గా చదువు పూర్తి చేసుకొని వస్తుంది. అదే వూరిలో వున్న ఒక బలమైన వస్తాదు ఆ వూరిలో దోపిడీ దొంగతనాలు చేయించి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. ఒకసారి మీనాక్షి వెళుతున్న బస్సు మీదకి దోపీడీ దొంగలు వస్తే, అందరూ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోవటానికి అడివిలోకి పారిపోతారు. ఆ సమయంలో హనుమంతు వచ్చి మీనాక్షిని కాపాడతాడు, అదే సమయంలో దొంగలు హనుమంతుని పొడిచి అక్కడ నదిలో పడేస్తారు. హనుమంతు నీటి అడుగుకి కొట్టుకుపోతున్నప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది,…
గుంటూరు కారం : మహేష్ మాస్ అవతారం!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు 14 ఏళ్ల తరువాత ’గుంటూరు కారం’ సినిమా రూపంలో అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది, ఇందులో శ్రీలీల, విూనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర తారాగణం. సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పండగకి విడుదలైన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే. సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) ఒక రాజకీయనాకుడు, అతని కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్యం (జయరాం) తో వివాహం…
Guntur Kaaram Movie Review in Telugu : ‘గుంటూరు కారం’ రుచి చూడాల్సిందే…!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వచ్చిన మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు …దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు … త్రివిక్రమ్ కాంబో అంటే సినిమాపై ఏ విధంగా అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితాల్ని పక్కన పెడితే వాటికి…
HanuMan Movie Review in Telugu: ఆకట్టుకునే ‘హనుమాన్’
‘హనుమాన్’ పేరు వింటేనే మనలో ఏదో అలజడి.. ఏదో ధైర్యం.. గత కొన్ని రోజులుగా సినీ ప్రేక్షకులతో పాటు, సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సినిమాఇది. ఈ సినిమా పేరు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్నదని చెప్పొచ్చు. వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన తొలి భారతీయ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’ నేడు (12 జనవరి-2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి పోటీలను లెక్కచేయకుండా ధైర్యంగా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకుల మనసులను గెలుచుకుందా? తెలిసుకుందాం… కథ: అంజనాద్రి అని ఒక చిన్న పల్లెటూరు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఊరు ఇది. ఆ ఊరిలో అల్లరి, చిల్లరిగా తిరుగుతూ, చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు (తేజ సజ్జ)తో…
వైభవంగా ‘మెకానిక్’ ఆడియో సక్సెస్ మీట్
టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ భూపాల మాట్లాడుతూ… విడుదలకు ముందే ఒక చిన్న సినిమా ఆడియో 10 మిలియన్ల వ్యూస్‌కు చేరువలో ఉందంటే మాటలు కాదు. ఖచ్చితంగా ఇది…