శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నూతన చిత్రం’ ప్రేమ విమానం’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివే శానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకటి డీవోపీ గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం:…
Year: 2022
వాహ్.. విజయ్ దేవరకొండ!!
తన వ్యక్తిత్వాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తుంటారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. నిజాయితీగా వ్యవహరించడం, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయనకు అలవాటు. తానో స్టార్ ననే స్టేటస్ ఎప్పుడూ చూపించరు. ఆయన తన వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన లైగర్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండను ప్రశ్నలు అడిగేందుకు ఓ పాత్రికేయుడు ఇబ్బంది పడ్డాడు. మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నా అన్నారు. దానికి విజయ్ స్పందిస్తూ…అదేం లేదు ఫ్రీగా అడగండి ఎలాంటి సందేహాలు వద్దు అంటు ముందున్న టేబుల్ మీద కాలు పెట్టి ఇలా దర్జాగా అడగండి నేను ఎంత ఎదిగినా మీ వాడినే అని చెప్పారు. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ విజయ్ గ్రౌండెడ్ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులు అయ్యారు.
ఈనెల 26న వస్తున్న సునీల్-హెబ్బా పటేల్ నటించిన ‘గీత’
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు “విశ్వ”ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.వినాయక్ ఆశీస్సులతో “గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. “మ్యూట్ విట్నెస్” అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది!! క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు!! ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ… “ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ……
సందడిగా సాగిన విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్ విడుదల
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు,…
ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి ఈ కార్తికేయ-2 చిత్రం అంకితం – అభిషేక్ అగర్వాల్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన కార్తికేయ -2 చిత్రం ఘనవిజయం సాధించింది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ కార్తికేయ సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా…
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రం నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదల
కోడి రామకృష్ణ గారి సమర్పణలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా, సంజన ఆనంద్ హీరోయిన్ గా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.. మాస్ బీట్ తో సాగే “నచ్చావ్ అబ్బాయి ”…
‘దోచేవారెవరురా..’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది : దర్శకులు శివనాగేశ్వరరావు
IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్కుని షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా దర్శకులు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ… దోచేవారెవారురా సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగా వస్తుంది, క్వాలిటీ పరంగా, నిర్మాణ పరంగా ఎక్కడ రాజి పడకుండా నిర్మాతలు సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ విడుదల చేయబోతున్నాము. సెప్టెంబర్…
‘తీస్ మార్ ఖాన్’ అందరినీ ఆకట్టుకుంటుంది : నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి
స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్”. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా.. చిత్ర హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ… ఈ మధ్య నేను…
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘సాక్షి’ చిత్రం టైటిల్ విడుదల
చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్ల హీరో, హీరోయిన్లుగా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, సుదర్శన్, భరణి ముఖ్య తారాగణంగా నిర్మాత చేతన్ రాజ్ నిర్మించిన చిత్రం ‘సాక్షి’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్బంగా .. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సమాజంలో నేడు ఆడపిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో జనాన్ని ఉద్రేకపరిచే, ఉత్తేజపరిచే వాళ్లకు విజ్ఞానాన్ని పెంపొందింపజేసే చిత్రాలు రావలసిన అవసరం ఉంది. అలాంటి చిత్రమే ఈ ‘సాక్షి’ అని అనుకుంటున్నాను. ఈ చిత్రం మహిళా ఇతివృత్తమని చెప్పారు. చేతన్…
ఆగస్ట్ 26న ‘భళా చోర భళా’ థియేటర్లలో విడుదల
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 26న మా భళా చోర భళా చిత్రం విడుదల కాబోతోంది.. కంప్లీట్ నెపోటీజమ్ సినిమా అనొచ్చు.. ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం.. ప్రదీప్ నాకు ఏవీఎస్‌గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు..…
