వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ విలేఖరుల సమావేశంలో ‘కృష్ణ వ్రింద విహారి’ విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్యని ఎప్పుడు కలిశారు ? – నాగశౌర్య గారికి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు. నాగశౌర్య స్వతహగా రచయిత కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ? – చాలా…
Year: 2022
ధనుష్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ కీలక పాత్రలో సందీప్ కిషన్
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” స్టన్నింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో అందరిద్రుష్టిని ఆకర్షించింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ప్రాజెక్ట్ లో చేరారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నారు సందీప్ కిషన్. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి బిగ్ స్టార్ల తో కలిసి సందీప్ చేస్తున్న ‘మైఖేల్’ చిత్రం కూడా భారీ అంచనాలను పెంచింది. సందీప్ కిషన్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మానగరం’లో హీరోగా తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా మెప్పించిన విషయం తెలిసిందే. మోస్ట్ ప్రామెసింగ్…
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సుధీర్ బాబు మాట్లాడుతూ..’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. ‘ఆ అమ్మాయి…
నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం ‘ఒకే ఒక జీవితం’ : హీరో శర్వానంద్ ఇంటర్వ్యూ
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మీడియా సమవేశంలో పాల్గొన్న హీరో శర్వానంద్ సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. ఒకే ఒక జీవితం విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? – ఆనందంగా వుంది. సెన్సిబుల్ సినిమా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి…
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ తెలుగులో విడుదల చేయడానికి కారణం ‘స్రవంతి’ రవికిశోర్ గారే!: దర్శకుడు గౌతమ్ మీనన్
శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ విడుదల చేశారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ”తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. ‘స్రవంతి’ రవికిశోర్ గారు ఫోన్ చేశారు. ‘నేను పాటలు విన్నాను. బావున్నాయి. ట్రైలర్ చూశా. నాకు నచ్చింది. తెలుగులో కూడా…
అక్టోబర్ 21 న వస్తున్న థ్రిల్లర్-లవ్ స్టోరీ ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “
బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా… చిత్ర నిర్మాత ప్రసాద్…
ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది : హీరో రాజ్ బాల
లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్ బాల. తాజాగా మెగా ఫిలిమ్స్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈషా చావ్లా హీరోయిన్. ఈ నెల 17 న రాజ్ బాల పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. మాది ప్రకాశం జిల్లా గిద్దరూరు యడవల్లి గ్రామం మా నాన్న ఆర్ టి సి కండక్టర్ నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం. నా డిగ్రీ అనంతరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నం చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ కరుణాకరన్ గారు “ఎందుకంటే ప్రేమంటే” సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు.ఆ…
జైద్ ఖాన్ పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ నుండి ట్రోల్ సాంగ్ విడుదల
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ట్రోల్ సాంగ్’ విడుదలైంది. బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్ ఇది. పాట చాలా హుషారుగావుంది. జాస్సీ గిఫ్ట్ వాయిస్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. భాస్కరభట్ల సాహిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆసక్తికరంగా సాగింది. జైద్ ఖాన్ వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు.…
Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Film Banaras Troll Song Out
Karnataka’s senior politician Zameer Ahmed’s son Zaid Khan is venturing into films with Banaras, a pleasant love story set in the backdrop of Banaras city (Varanasi). The Pan India project being directed by Jayathirtha of Bell Bottom fame and produced by Tilakraj Ballal under the banner of NK Productions features Sonal Monteiro essaying Zaid Khan’s love interest. The film’s first single ‘Troll Song’ is out now. It’s a party anthem with energetic beats composed by B. Ajaneesh Loknath. The composer maintained same energy and tempo in the beat from start…
కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ఫస్ట్ సింగిల్ వేగం విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. అంచనాలను భారీగా పెంచిన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే క్యూరీయాసిటీని పెంచింది. ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలసి తమ లవ్లీ టైమ్ ని చాలా ఉల్లాసంగా గపడం చాలా ప్లజంట్ గా ప్రజంట్ చేశారు. నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా,…
