కంటెంట్ ఈజ్ కింగ్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది కాంతార సినిమా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. లీడ్ పెయిర్ నటన.. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక టెక్నికల్ టీమ్ అయితే కాంతారకు ప్రాణం పోశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచి కాంతార సినిమా…
Year: 2022
‘ఆహా..’ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి!
‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’… రాబోతున్న ఈ వింటర్ కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి అహా వారు అందించబోతున్న సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి సూపర్ స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించబోతున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ తల పండిన నిర్మాతనో తీయలేదు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను నెలకొల్పి అలీ ఈ మంచి చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పైగా ఈ కథలో నరేష్ – పవిత్రా లోకేష్ జంటగా కనిపించబోతున్నారు. ఇద్దరి మధ్య మరోసారి…
చిరంజీవి మెగా154 ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి విడుదల
మెగాస్టార్ చిరంజీవి మెగా154 మేకర్స్ దీపావళికి ముందు విడుదల చేసిన మెగా154 గ్లింప్స్ ఒక మెరుపులా వచ్చి దీపావళి బ్లాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయడంతో ఎదురుచూపులకు తెరపడింది. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి సినిమాల నుండి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేశారు దర్శకుడు బాబీ. టైటిల్ టీజర్ లో.. భారీ ఓడలో కూర్చున్న విలన్ .. ” ఏంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఎడ్రా మీ అన్నయ్యా .. సౌండే లేదు” అన్న వెంటనే ఒక భారీ బ్లాస్టింగ్ సౌండ్ తో…
‘షరతులు వర్తిస్తాయి’ యూనివర్సల్ పాయింట్ : మామిడి హరికృష్ణ
స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం లో, చైతన్య రావ్, భూమి శెట్టి ప్రధాన పాత్రదారులుగా,నాగార్జున్, శ్రీష్, కృష్ణకాంత్ నిర్మాతలుగా, కుమారస్వామి (అక్షర కుమార్) రచన – దర్శకత్వం లో, ఒక అర్బన్ టౌన్ సెటప్ లో వాస్తవికతను అద్దం పడుతూ జరిగే ఒక కుటుంబ కథాచిత్రంగా త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఈ దీపావళి సందర్భంగా గౌ. శ్రీ డా.మామిడి హరికృష్ణ (తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్, కవి , సినీ విమర్శకులు, చరిత్ర కారులు) చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ క్యాచీ టైటిల్ , యూనివర్సల్ ఎలిమెంట్స్ తో నాణ్యమైన కథ, నైపుణ్యంతో కూడిన చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం పక్కాగా అన్ని వర్గాల వారిని అలరింపచేస్తుందని పేర్కొంటూ అందరకి దీపావళి శుభాకాంక్షలు…
‘టిక్ టాక్’ ను మరిపించేలా యువ ట్యాలెంట్ ను ప్రోత్సహించడానికి “ME 4 Tic Tic” యాప్ వచ్చింది!
ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం “టిక్ టాక్” ను బ్యాన్ చేసింది. ఆ తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి మరో ఆల్టర్నేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” సంస్థ వారు “ME 4 Tic Tic” యాప్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖులు మరియు యువత సమక్షంలో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. టిక్ టాక్ లేక ఇబ్బంది పడుతున్న ట్యాలెంటెడ్…
Brand New Poster Of Shiva Rajkumar’s Pan India Project GHOST Wishing Everyone A Happy Deepavali
Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is undergoing it’s shoot in a brisk pace. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. On the eve of Diwali, Team ‘Ghost’ wished everyone with a brand new poster. The poster features Shivaraj Kumar holding a gun with bullets flying all-over. The fire and smoke backdrop added more intensity to the…
కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’ దీపావళి పోస్టర్ విడుదల..భారీ సెట్ లో షూటింగ్
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది . భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో…
ఇఫీలో ఇండియన్ పనోరమాకు ‘స్రవంతి’ రవికిశోర్ తొలి తమిళ సినిమా ‘కిడ’ ఎంపిక
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఇటీవల వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. ‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశా. ఇది…
‘ఓరి దేవుడా’ అందరినీ మెప్పిస్తోంది : హీరో విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్స్ మిథిలా పాల్కర్, ఆశా భట్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… హీరో మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా నుంచి సపోర్ట్ చేస్తోన్న అందరికీ థాంక్స్. ఓరి దేవుడా మూవీ మిమ్మల్ని…
‘రుద్రంగి’లో జ్వాలాబాయి దొరసానిగా మమతా మోహన్ దాస్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
ఎం.ఎల్.ఏ, శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ. చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో ‘భీమ్ రావ్ దొర’ గా కనిపించనున్నారు. ఇక తాజాగా ‘రుద్రంగి’ సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. భయమెరుగని ధీరవనిత పాత్రలో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన…
