ఐస్ ల్యాండ్ బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ‘స్పార్క్’ పాట చిత్రీకరణ పూర్తి

Spark Team wrapped up the beautiful song filming in picturesque locales of Iceland

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రతి నాయ‌కుడిగా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ సుందరం నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి వస్తోన్న అనౌన్స్‌మెంట్స్ ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. తాజాగా ఐస్ ల్యాండ్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో స్పార్క్ మూవీకి సంబంధించిన రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణను పూర్తి చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకు కనుల విందు చేయనుంది. స్పార్క్ చిత్రం ద్వారా అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు…

45 ఏళ్ల నా నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి ‘అనుకోని ప్రయాణం’ : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్

Anukoni prayanam pre relese event

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ ‘అనుకోని ప్రయాణం’అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు. 45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర…

ఏ.పి రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ నియామకం

ali ap media advaiser

రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న సినీ నటుడు – ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరిగానే అలీకి జీతభత్యాలు లభించనున్నాయి. 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన అలీ… పలువురు సినీ నటులను వైసీపీకి చేరువ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఆయనకు మంచి పదవే దక్కుతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే…

క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సమంత ‘యశోద’ ట్రైలర్!

samantha Yashodha movie trailer review

‘యశోద’ ఎవరో తెలుసు కదా… కాబోయే మదర్, ఫైటర్ & పవర్‌ఫుల్! *** ‘యశోద’ ఎవరో తెలుసు కదా? ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి! – ట్రైలర్ చివరలో వినిపించిన డైలాగ్. అప్పటికి ‘యశోద’ ఎవరని కాదు, ఎటువంటి మహిళ అనేది కూడా ప్రేక్షకులకు అర్థం అవుతుంది…. షి ఈజ్ ఎ మదర్, ఫైటర్ అండ్ వెరీ పవర్‌ఫుల్ వుమన్ అని! ఆ పాత్రలో సమంత అదరగొట్టారని! సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ‘యశోద’ ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్…

ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే.. నా నుంచి పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది : ఎస్వీ కృష్ణారెడ్డి

organic mama haibreed alludu

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…

డిసెంబర్ 23న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ’18 పేజీస్’ విడుదల

18pages movie

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్…

యన్టీఆర్ అవార్డ్ కు ఎంపికైన అలనాటి అందాలతార, నర్తకి ఎల్. విజయలక్ష్మి : 50 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు..

NTR AWARD : L VIJAYALAKSHMI

బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. 50 సంవత్సరాల తర్వాత…

‘ERROR500” టీజర్ ని విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

'ERROR500'' teser relese

మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500”. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘ERROR500” చిత్రం టీజర్ ని విడుదల చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు. జస్వంత్…

ఈ నెల 28న ఆహా లో ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’

andharubagundali andhulo nenundali

  ‘అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి’ : ఎస్‌.వి. కృష్ణారెడ్డి మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేసి తెరకెక్కించిన యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్‌, టీజర్‌ను ఘనంగా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్‌ కామెడియన్‌ బ్రాహ్మానందం చేతుల మీదుగా ‘అందరూ బాగుండాలి…

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు * కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. * అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు. ** సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. * టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు…