Ante Sundaraniki Movie Review : కామెడీ ఎంటర్‌టైనర్!

ante sundaraniki movie telgu review

By ABDUL M.D – Tollywoodtimes చిత్రం : అంటే…సుందరానికీ! రచన-దర్శకత్వం : వివేక్ ఆత్రేయ విడుదల తేది : 10 జూన్ 2022 రేటింగ్ : 2.75/5 నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి , అజగం పెరుమాల్, నిక్కీ తంబోలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి ఎడిటింగ్ : రవితేజ గిరిజాల) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అంటే… సుందరానికీ’ పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇదొక రొమాంటిక్ కామెడీ…

యన్టీఆర్ అభిమాని NTR RAJUకు సన్మానం!!

యన్టీఆర్ అభిమాని NTR RAJUకు సన్మానం!!

తిరుపతిలో యన్టీఆర్ శత జయంతి సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్)కు చీఫ్ జస్టిస్ రమణ గారు, దగ్గుబాటి పురందేశ్వరి గార్ల చేతుల మీదుగా ఘనంగా సన్మానం తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ నాయకులు అభిమానులు అనేక మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రమణ గారితో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్) కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.అక్కడ జరిగిన అశేష జనసంద్రంలో ఆమె మాట్లాడుతూ తిరుపతి అంటే ఎన్టీఆర్‌ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే అంతే ఇష్టం.అందుకే ఈ రోజు ఇక్కడ నాన్నగారి శత జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందుకు…

జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల

జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు.…

మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిద‌ర్శ‌నం : న‌రేశ్ వి.కె ఇంటర్వ్యూ…

మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిద‌ర్శ‌నం : న‌రేశ్ వి.కె ఇంటర్వ్యూ.. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. న‌జ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా న‌టించిన న‌రేశ్ వి.కె మీడియాతో ప‌లు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌ల‌ను పండించారు. 'అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండ‌బోతోంది? -ఈ ఎరాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుత‌మైన పాత్ర‌లు పోషించ‌డం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్ర‌ల‌కు ఆడ‌పిల్ల‌ల‌నుంచి మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. అ..ఆ., భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, స‌మ్మోహ‌నం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాద‌ర్‌ గా నిలిచాయి. అంటే సుందరానికీ` సినిమాలో నానికీ నాకు మంచి ర్యాపో వుంది. నాని కామెడీ టైమింగ్ చాలా స్పార్క్‌గా వుంటుంది. సెక‌న్‌లో క్యాచ్ చేసేస్తాడు. నేను ఆ స్కూల్ నుంచి వ‌చ్చిన‌వాడిని క‌నుక నాకు తెలుసు. నేను ఇందులో చేసిన ఫాద‌ర్ పాత్ర `ది బెస్ట్‌` అని చెప్ప‌గ‌ల‌ను. దానికి రెండు కార‌ణాలున్నాయి. మొద‌టిది ద‌ర్శ‌కుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మ‌ధ్య కామెడీ టైమింగ్‌. ఎమోష‌న్‌ ను క్యారీ చేస్తూ ఆడియ‌న్స్‌ను న‌వ్వించే పాత్ర. కీల‌క‌మైన పాత్ర ఇది. నానితో ఫాద‌ర్‌ గా, దేవ‌దాసులో బ్రదర్ గా చేశాను. మ‌ళ్ళీ ఫాద‌ర్‌ గా చేశాను. మా ఇద్ద‌రి మ‌ధ్య డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ కూడిన‌వి. మేమిద్ద‌రం న‌టిస్తుంటే సెట్లో అంద‌రూ లీన‌మైపోయి ఓన్ చేసుకున్నారు. అలాగే రోహిణి పాత్ర కూడా. త‌ను మంచి న‌టి. ఈ సినిమా త‌ర్వాత నెక్ట్స్ లెవ‌ల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సివుంటుంది. నానికి చాలా కాలం త‌ర్వాత హ్యూమ‌ర్ జోన‌ర్ ప‌డ‌డం అదృష్టం. # మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ‌లో ప‌నిచేయ‌డం ఎలా వుంది? - ఈ మ‌ధ్య వ‌రుస‌గా యాక్ష‌న్ సినిమాలు వ‌చ్చాయి. అన్నీ హిట్ అయి తెలుగులో విజ‌య‌ప‌తాకాన్ని ఎగుర‌వేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో కుటుంబ‌క‌థా చిత్రాలు త‌గ్గాయి. మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబ‌క‌థాచిత్రాల‌కు ఆణిముత్యంలాంటి సంస్థ అని చెప్పొచ్చు. మెమొర‌బుల్ హిట్ అవుతుంది. మైత్రీనుంచి పుష్ప‌, స‌ర్కారువారి పాట ఇలా వ‌ర‌స విజ‌యాల్లో ఈ సినిమా మ‌రోటి అవుతుంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ నిర్మాణ విలువ‌లు, న‌టీన‌టుల‌కు కంఫ‌ర్ట్ ఇస్తారు. వారు మిత‌బాషీయులు. వారు ఎంచుకునే క‌థ‌లు హైల‌ట్ అవుతాయి. అవే వారి విజ‌యానికి నిద‌ర్శ‌నం. # మీరు చాలా పాత్ర‌లు పోషించారు. బ్రాహ్మ‌ణుడి పాత్ర చేయ‌డం ఎలా వుంది? - గ‌తంలో జంథ్యాల గారి సినిమాల్లో బ్రాహ్మ‌ణుడి పాత్ర‌లు చేశాను. ఆ త‌ర్వాత ఇలాంటి పాత్ర ఏదీ చేయ‌లేదు. మొద‌టి లాక్‌డౌన్‌లో వివేక్ ఆత్రేయ‌గారు క‌థ రాసుకున్న‌ప్పుడే నన్ను ఊహించి రాసుకున్నార‌ని చెప్పారు. క‌రోనా విప‌రీతంగా వున్న టైంలో కూడా కుటుంబంలా ఈ సినిమాకు అంద‌రం ప‌నిచేశాం. బ్రాహ్మ‌ణుడి పాత్ర కోసం బ‌రువు త‌గ్గాను. మేకోవ‌ర్ మార్చుకున్నా.శైవ‌త్వం వున్న బ్యాక్‌గ్రౌండ్ కాబ‌ట్టి ఆవిధంగా తీర్చిదిద్దుకున్నాను. నా ఫేస్ నాకే బోర్ కొట్ట‌కూక‌డ‌దు. అందుకే మేకోవ‌ర్ చేసుకుంటాను. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక నాని, నా కాంబినేష‌న్ అదిరిపోయింద‌ని చాలామంది చెప్పారు. హీరోయిన్ కూడా మ‌ల‌యాళంలో స్టార్‌. త‌ను బాగా చేసింది. # నిజ ‌జీవితంలో మీ కుమారుడితో ఫ్రెండ్లీగా వుంటారు. కానీ ఇందులో నాని మిమ్మ‌ల్ని ఇరిటేట్ చేస్తాడు. ఎలా అనిపించింది? - ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ లో తండ్రి కొడుకుతో ఫ్రెండ్లీగానే వుండాలి. లేదంటే తేడాలు వ‌చ్చేస్తాయి. ఈ సినిమాలో సాంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు గ‌ల కుటుంబం క‌నుక చిన్న‌ప్ప‌టినుంచి ఒక ప‌ద్ద‌తిలో నాని పెరిగిన‌వాడు. అలాంటివ్య‌క్తి స్వంత నిర్ణ‌యాలు తీసుకుంటే ఎలా వుంటుంద‌నేది సినిమా. ఇప్ప‌టివ‌రకు పెండ్లిచూపులు, పెండ్లి తంతు వుండేవి. కానీ కాలం మార‌డంతో రివ‌ర్స్ అయింది. అందుకే నాని పాత్ర‌కు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ బాగా క‌నెక్ట్ అవుతారు. రెండు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు గ‌ల కుటుంబాల మ‌ధ్య ఏం జ‌రిగింది అనేది ఆస‌క్తిగా వుంటుంది. నేను ఇప్ప‌టివ‌ర‌కు 200కుపైగా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో బ్రాహ్మ‌ణుని పాత్ర‌కు యాస‌లో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి 9రోజులు ప‌ట్టింది. ఇలా ఎప్పుడూ జ‌ర‌గలేదు. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వ‌ల్లే. ఆయ‌న‌కు మంచి క్లారిటీ వుంది. # ట్రైల‌ర్లో మూలిక‌లు సీన్ బాగా వ‌ర్క‌వుట్ అయిందే? - ఆ సీన్ చేసేట‌ప్పుడు సెట్లో అంద‌రూ న‌వ్వేశారు. నేను న‌వ్వు ఆపుకోలేక‌పోయాను. దాంతో మూడు టేక్‌లు చేయాల్సివ‌చ్చింది. నాదేకాదు అన్ని పాత్ర‌లు అలానే చేశాయి. న‌దియా, పెరుమాళ్ళు పాత్ర‌లు బాగా వ‌చ్చాయి. వేరియేష‌న్స్ అద్భుతంగా చిత్రీక‌రించారు. ఈ చిత్రం ఆల్ క‌మ్యూనిటీ అండ్ ఆల్ లాంగ్వేజ్ ఫిలిం అని చెప్ప‌వ‌చ్చు. # కులాలు అనేది సున్నిత‌మైన అంశం దాన్ని ఎలా బ్యాలన్స్ చేశారు? - ఆ క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడు వివేక్‌దే. ఏ ఒక్క క‌మ్యూనిటీని నొప్పించ‌కుండా చేయ‌డం అనేది గ్రేట్‌. ఈ సినిమా చూస్తే రెండు క‌మ్యూనిటీవారు ఎంజాయ్ చేస్తారు. ఈరోజుల్లో కులాలు, మ‌తాలు, ఖండాంత‌రాలు దాటి పెండ్లిళ్లు జ‌రుగుతున్నాయి. క‌నుక ఇది నేటి జ‌న‌రేష‌న్‌ కు ఫ‌ర్‌ ఫెక్ట్ ఫిలిం. ఒకప్పటి పెండ్లి తంతులు దూర‌మ‌యి స‌హ‌జీవ‌నం వచ్చేస్తున్నాయ్. ఇక ఈ సినిమాకు నికేత్ బొమ్మి కెమెరా నైపుణ్యం అద్భుతంగా వుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా 16 కూరల తెలుగు కంచం. # ఈ చిత్రాన్ని మ‌రోచ‌రిత్ర‌, సీతాకోక‌చిలుతో పోల్చ‌వ‌చ్చా? - అలా చెప్ప‌లేం. అవి వేరే సినిమాలు ఇది వేరే సినిమా. న‌టుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా. నా కెరీర్‌ ను త‌ర్వాత స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది. # ఈ మ‌ధ్య కామెడీ చిత్రాలు ఎక్కువయ్యాయి. వాటి గురించి మీ విశ్లేష‌ణ‌? - కామెడీ సినిమాలు గ‌తంలో జంథ్యాల‌, వంశీ, రేలంగి న‌ర‌సింహారావు చిత్రాలు వ‌చ్చాయి. ఇవాళ నేటి ఆడియ‌న్స్ ప‌ల్స్ బ‌ట్టి సినిమాలు తీస్తున్నారు. అప్ప‌ట్లో తెలుగు సినిమాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే. దానివ‌ల్ల మంచి సినిమాలు వ‌చ్చేవి. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత వేరు వేరు అయితే స‌రిగ్గా తీయ‌డం క‌ష్టం. మ‌ర‌లా ఇప్పుడు పాత రోజులు మాదిరే ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే అయ్యేలా యంగ్ ద‌ర్శ‌కులు రావ‌డం ఆనందంగా వుంది. అయితే కామెడీ సినిమాలు రాయ‌డం క‌ష్టం. తీయ‌డం మ‌రీ క‌ష్టం. న‌టీన‌టులు కుద‌ర‌డం మ‌రింత క‌ష్టం. ఈ సినిమాలో అన్ని భాష‌ల న‌టీన‌టులున్నారు. వారంతా టైమింగ్ వున్న వారే. నా మ‌ద‌ర్‌ గా భిక్షు గారి భార్య న‌టించింది. త‌ను బాగా న‌టించింది. ఏది ఏమైనా ఒక సినిమా హిట్ అయితే వ‌ర‌స‌గా కొద్దికాలం అవే వ‌స్తుంటాయి. మారుతీ ద‌ర్శ‌క‌త్వం లో ప్రేమ‌క‌థా చిత్రం వ‌చ్చాక హార‌ర్ కామెడీ వ‌రుస‌గా వ‌చ్చాయి. # కొత్త సినిమాలు? - నేను లీడ్ రోల్స్‌గా రెండు సినిమాలు చేస్తున్నాను. 38 ఏళ్ళ పాత్ర కూడా చేస్తున్నా. # కామెడీ సినిమాలంటే న‌టీన‌టులు ఎక్కువ‌గా వుంటారు. సీనియ‌ర్‌గా మీకు మిగ‌తా వారి స‌పోర్ట్ ఎలా వుంటుంది? - జ‌న‌ర‌ల్‌ గా నేను ఎవ‌రికీ క్లాస్ పీక‌ను. కొత్త‌వారైనా పాత‌వారైనా నాకు కంఫ‌ర్ట్ జోన్ ఇస్తారు. ఒక‌రినొక‌రు ఓవ‌ర్ టేక్ చేయ‌డం వుండ‌దు. నేను ద‌ర్శ‌కుడి న‌టుడ్ని. న‌టించ‌డం కంటే ప్ర‌వ‌ర్తిస్తాను. అదే మా అమ్మ‌గారు చెప్పారు. అదే ఫాలో అవుతున్నా. న‌టుడికి బాడీలాంగ్వేజ్ వున్న‌ట్లే ద‌ర్శ‌కుడికి కంట్రోల్ వుండాలి. అది వివేక్‌ లో బాగా వుంది. నేను ఇంత‌కుముందు మ‌హాన‌టి, శ్రీ‌దేవిసోడాసెంట‌ర్‌.. ఇలా ఎన్ని పాత్ర‌లు చేసినా అవ‌న్నీ ద‌ర్శ‌కుల క్రియేష‌న్‌. # న‌టుడిగా మీ నెక్ట్ లెవ‌ల్ ఎలా వుండ‌బోతోంది? - నేను శ్రీ‌వారికి ప్రేమ‌లేఖ‌, జంబ‌లకిడిపంబ‌.. ఇలా భిన్న‌మైన జోనర్స్ చేశాను. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి వెళ్ళాను. తిరిగి వ‌చ్చాక ఎలాంటి పాత్ర‌లు న‌రేశ్ చేస్తాడో అనే అనుమానం చాలా మందిలో వుంది. ఆ టైంలో దృశ్యం, చంద‌మామ‌క‌థ‌లు చిత్రాల్లో మంచి పాత్ర‌లు వ‌చ్చాయి. మీరు ఏ పాత్ర‌నైనా చేయ‌గ‌ల‌రు అనే స్థాయికి వెళ్ళ‌గ‌లిగాను అంటే గ‌ర్వంగా వుంది. # సెకండ్ ఇన్నింగ్స్‌ లో ఇమ‌డ‌డానికి ఎంత‌కాలం ప‌ట్టింది? - నేను సెకండ్ ఇన్నింగ్స్‌లో రావ‌డానికి ఎస్‌.వి. రంగారావును స్పూర్తిగా తీసుకున్నాను. ఆయ‌న మెప్పించ‌ని పాత్ర లేదు. అలా న‌న్ను నేను సెట్ చేసుకోవ‌డానికి ప‌దేళ్ళు ప‌ట్టింది. తెలుగులో మంచి పాత్ర‌లు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్ చూడ‌కుండా మంచి పాత్ర అనిపిస్తే చేస్తున్నాను. నేను సినీ కుటుంబం నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి నిర్మాత సాధ‌క బాధ‌లు తెలుసు.

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. న‌జ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా న‌టించిన న‌రేశ్ వి.కె మీడియాతో ప‌లు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌ల‌ను పండించారు. ‘అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండ‌బోతోంది? -ఈ ఎరాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుత‌మైన పాత్ర‌లు పోషించ‌డం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్ర‌ల‌కు ఆడ‌పిల్ల‌ల‌నుంచి మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. అ..ఆ., భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, స‌మ్మోహ‌నం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాద‌ర్‌…

‘మాయా పేటిక’ టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

‘మాయా పేటిక’ టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్‌ను టాలీవుడ్ హండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థ‌లో మ‌రో వెరైటీ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్ర‌మ‌ణియ‌మ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని మేక‌ర్స్ తెలియ‌జేశారు. సాంకేతిక నిపుణులు : క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ర‌మేష్ రాపార్తి నిర్మాత‌లు : మాగుంట శ‌ర‌త్…

నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌

నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు స‌త్య‌దేవ్ – గోపి గ‌ణేష్ కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘135 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఈ మ‌ధ్య గాడ్సే గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. చాలా కాంట్ర‌వ‌ర్సీలు కూడా అవుతున్నాయి. కానీ సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ గాడ్సే అలాంటి గాడ్సే కాదు. అయితే ఈ సినిమా…

‘విక్ర‌మ్‌’ విజయం ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ దే : శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి

'విక్ర‌మ్‌' విజయం ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ దే : శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి

కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్‌` జూన్‌3న విడుద‌లై విశ్వ‌వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. తెలుగు, త‌మిళ రాష్ట్రాల లోనూ క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ సుధాకర్ రెడ్డి త‌మ స్వంత బేన‌ర్‌ శ్రేష్ఠ్ మూవీస్‌ ద్వారా విడుద‌ల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి స‌క్సెస్‌ను సాధించారు. ఈ సంద‌ర్భంగా గురువారం సుధాకర్ రెడ్డి మీడియా స‌మావేశంలో త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ, ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు. # `విక్ర‌మ్‌` తీసుకున్న‌ప్పుడు మీరేమ‌నుకున్నారు? ఇప్పుడు ఎలా వుంది? -క‌మ‌ల్ హాస‌న్ అభిమాని అయిన‌ ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖ‌చ్చితంగా మంచి…

Vishnu Manchu coming up with Ava Entertainment on June 10

Vishnu Manchu coming up with Ava Entertainment on June 10

Tollywood’s talented actor and producer Vishnu Manchu, who never fails to impress the audience with his interesting lineup of films, is now all set to come up with his own production company “AVA ENTERTAINMENT”. It is heard that the core objective of this company is to inspire and welcome new talent, support innovative ideas, and recognize and be reachable to aspirants. Through Ava, the actor will make feature films, digital films, web series, docu-series, and would mainly focus on providing an opportunity to deserving aspirants. The Manchu actor is also…

బర్త్ డే సందర్భంగా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” హీరో త్రిగున్ కు ‘మిలియన్ వ్యూస్’ కానుక!!

బర్త్ డే సందర్భంగా "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్" హీరో త్రిగున్ కు 'మిలియన్ వ్యూస్' కానుక!!

“వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే” పాటకు అద్భుతమైన స్పందన లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ‘మధుదీప్ సి.హెచ్’ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి “వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే” అనే పల్లవితో సాగే సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది!! “ఒకే ఒక లోకం నువ్వే…” పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. “సరెగమ మ్యూజిక్’ ఈ చిత్రం ఆడియో హక్కులు సొంతం చేసుకుంది.…

ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం :  హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం :  హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజేఎఫ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రెండు రోజుల…