సురేఖమ్మ పాత్రకు న్యాయం చేశానని సుష్మితా పటేల్ మెచ్చుకున్నారు : ‘కొండా’ హీరోయిన్ ఇర్రా మోర్ ఇంటర్వ్యూ..

సురేఖమ్మ పాత్రకు న్యాయం చేశానని కొండా సుష్మితా పటేల్ మెచ్చుకున్నారు : 'కొండా' హీరోయిన్ ఇర్రా మోర్ ఇంటర్వ్యూ..

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ ఇర్రా మోర్! మీ గురించి చెప్పండి మాది ఆగ్రా, ఉత్తర ప్రదేశ్. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరుకున్నా. మొదట థియేటర్‌లో చేరాను. ఏడాదిన్నర పాటు హిందీ నాటకాల్లో పాత్రలు పోషించా. నార్త్ అంతా స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని చాలా ఆడిషన్స్ ఇచ్చా. రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీసుకు కూడా వెళ్లాను. ఆయన ‘భైరవగీత’ సినిమా…

అద్భుతమైన తెలుగు కంటెంట్ కలిగిన కొత్త 11 ఒరిజినల్ సిరీస్‌లను సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసిన ZEE5

అద్భుతమైన తెలుగు కంటెంట్ కలిగిన కొత్త 11 ఒరిజినల్ సిరీస్‌లను సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసిన ZEE5

ప్రస్తుతం తెలివిజన్ రంగంలో భారతదేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్ ZEE5, ZEE5 100+ టేస్ట్ క్లస్టర్‌లలో విభిన్నమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది మరియు నిజమైన, సంబంధిత మరియు ప్రతిధ్వనించే కథాంశాలపై దృష్టి సారించింది. ఈ రోజు, ZEE5 5 లక్షల+ గంటల కంటే ఎక్కువ డిమాండ్ కంటెంట్ మరియు 160+ లైవ్ టీవీ ఛానెల్‌లకు నిలయంగా ఉంది. 3500కి పైగా చలనచిత్రాలు, 1750 టీవీ కార్యక్రమాలు, 700 ఒరిజినల్‌లతో కూడిన గొప్ప లైబ్రరీతో ZEE5 12 భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ. ప్లాట్‌ఫారమ్ 2022 కోసం అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది, ఇది దాని విస్తృతమైన కంటెంట్ లైబ్రరీకి జోడిస్తుంది, వినోదం కోరుకునేవారికి విస్తృత శ్రేణి…

‘విరాట పర్వం’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా : సాయి పల్లవి ఇంటర్వ్యూ

విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సాయి పల్లవి ఇంటర్వ్యూ

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. సాయిపల్లవి పంచుకున్న విరాటపర్వం విశేషాలివి. సరళ గారి కుటుంబాన్ని కలవడం ఎలా అనిపించింది ? సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు. సరళకు జరిగిన అన్యాయం గురించి ఎలా ఫీలయ్యారు ? నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దిన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యాను. వెన్నెల పాత్రగానే చేశాను. వేణు ఊడుగుల కథ చెప్పినపుడు…

ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా : ‘7 డేస్ 6 నైట్స్’ హీరో రోహన్ ఇంటర్వ్యూ..

ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా : '7 డేస్ 6 నైట్స్' హీరో రోహన్ ఇంటర్వ్యూ మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. 'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రోహన్ మీడియాతో ముచ్చటించారు.  ప్రశ్న: మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి? రోహన్: మా తల్లిదండ్రులు ఇద్దరిదీ గుంటూరు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ పైలట్. అందువల్ల, చిన్నతనం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగా. పాన్ ఇండియా చైల్డ్ అనుకోండి. హైదరాబాద్‌లోనూ చదివా. ఫ్రాన్స్‌లో స్కాలర్షిప్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ & రోబోటిక్స్‌లో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ చేశా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు కాబట్టి అవకాశాలు వస్తాయా? లేదా? అనే ఆలోచన ఉండేది. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు థియేటర్ చేశా. శిక్షణ తీసుకున్నా. అప్పుడు యాక్టింగ్‌తో ప్రేమలో పడ్డాను. థియేటర్ అయ్యాక ఇంట్లో చెప్పి యూరోప్‌లో ఫిల్మ్ స్కూల్‌లో అప్లై చేశా.  ప్రశ్న: '7 డేస్ 6 నైట్స్'లో అవకాశం ఎలా వచ్చింది? రోహన్: ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు షో రీల్ కూడా చేశా. ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ఇచ్చేవాడిని. దర్శక, నిర్మాతలను కలిసినప్పుడు అది చూపించేవాడిని. ఆ షో రీల్ సునీల్ గారి చేతిలో పడింది. అదే రోజు ఆయన ఎంఎస్ రాజు గారిని కలిశారు. నా షో రీల్ చూపించారట. అప్పుడు ఆయన '7 డేస్ 6 నైట్స్' చేయాలనుకుంటున్నారు. కొత్తవాళ్లను తీసుకుందామనే ఆలోచనలో ఉన్న రాజు గారు... ఒక పాత్రకు నేను సూట్ అవుతానని తీసుకున్నారు. ఎంఎస్ రాజు గారి మూవీ కావడంతో ఎగిరి గంతేశా. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు.  ప్రశ్న: సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? రోహన్: నా పాత్ర పేరు మంగళం. మన స్నేహితులలో అటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ఎటువంటి భయాలు లేకుండా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఈ పని చేస్తే ఏమవుతుందనేది ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్‌తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగిందనేది కథ.  ప్రశ్న: పోస్టర్స్, ట్రైలర్స్ చూస్తుంటే... చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి! రోహన్: నేను సినిమా చూశా. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసినా... ఎక్కడా అసౌకర్యంగా ఉండదు. చీప్ కంటెంట్ అని ఎక్కడా అనిపించదు.  ప్రశ్న: '6 డేస్ 7 నైట్స్' అని ఇంగ్లిష్ సినిమా ఉంది! రోహన్: ఆ సినిమాకు, మా సినిమాకు అసలు సంబంధం లేదు.  ప్రశ్న: ఎంఎస్ రాజు గారు బ్లాక్ బస్టర్స్ తీశారు. హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించడం... రోహన్: ఎంఎస్ రాజు సినిమాలు చూస్తూ పెరిగా. ఆయన సినిమా అంటే నాకు చాలా పెద్ద అవకాశం. ఆయన బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. షూటింగ్ ఫస్ట్ డే నెర్వస్ ఫీలయ్యా. రెండు మూడు టేక్స్ ఓకే కాలేదు. అప్పుడు ఆయన పక్కకి పిలిచి 'నీలో పొటెన్షియల్ ఉంది. అందుకే, తీసుకున్నా. నువ్వు నెర్వస్ ఫీలవకు. క్యారెక్టర్ మీద ఫోకస్ చెయ్' అని చెప్పారు. రెండో రోజుకు సెట్ అయిపోయా.  ప్రశ్న: సుమంత్ అశ్విన్‌తో నటించడం... రోహన్: తొలిసారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డా. సుమంత్ అన్న ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ కదా! అయితే, అన్న చాలా డౌన్ టు ఎర్త్. ఎంఎస్ రాజు అబ్బాయి అనే యాటిట్యూడ్ ఎక్కడా చూపించలేదు. ప్రశ్న: ఇటువంటి జానర్ సినిమా ఎంపిక చేసుకోవడానికి కారణం? రోహన్: నటుడిగా మనకు కొన్ని పాత్రలు చేయాలని ఉంటుంది. '7 డేస్ 6 నైట్స్'లో నాది కొంచెం కామెడీ రోల్. కామెడీ చాలా కష్టమైన జానర్. నేనూ కొంచెం కష్టం అనుకున్నాను. ఎంఎస్ రాజు గారు ఆడిషన్స్ చేసిన తర్వాత నేను చేయగలనని నమ్మారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశా. ఈ సినిమా చూస్తే... న్యూ ఏజ్ మూవీ. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నటుడిగా మంగళం పాత్ర చేసేటప్పుడు ఎంజాయ్ చేశా. మంగళం తెలంగాణ యాసలో మాట్లాడతాడు. నాకు ఏమో ఆంధ్ర యాస వస్తుంది. నేను రియల్ లైఫ్ ఫ్‌లో రిజ‌ర్వ‌డ్‌. మంగ‌ళం ఎక్స్రావ‌ర్ట్‌. అందువల్ల, ఈ పాత్ర చేయడం ఛాలెంజింగ్ అనిపించింది.   ప్రశ్న: తెలంగాణ యాస నేర్చుకున్నారా? రోహన్: ఎంఎస్ రాజు గారు ఫోన్ చేసి తెలంగాణ యాస అనగానే 'చేసేద్దాం' అన్నాను. కానీ, లోపల చిన్న ఆందోళన ఉంది. నాకు స్నేహితుల్లో కొంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటం, ఇటీవల తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూడటం చేశా. అలా డైలాగులు ప్రాక్టీస్ చేశా.  ప్రశ్న: హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి... రోహన్: మా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈజీగా కలిసిపోతారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎంఎస్ రాజు గారు ఆడిషన్స్ చేసినప్పుడు, ఆ తర్వాత కలిశాం. అందువల్ల, ఈజీగా చేశా. నాకు జోడీగా కృతికా శెట్టి నటించారు. మరో హీరోయిన్ పేరు మెహర్ చాహల్. ఇద్దరికీ ఇదే తొలి సినిమా.   ప్రశ్న: యువతను ఆకట్టుకునే సినిమా అని ట్రైలర్లు చూస్తే తెలుస్తుంది. సందేశం ఏమైనా ఉందా? రోహన్: సందేశం ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ఎక్కువ చెబితే... స్టోరీ రివీల్ అవుతుంది. పాఠం చెప్పినట్టు ఉండదు. కానీ, మెసేజ్ ఉంటుంది.  ప్రశ్న: మీ తదుపరి సినిమా? రోహన్: ఈ సినిమాకు వచ్చిన స్పందన బట్టి చూడాలి. రెండు మూడు చర్చల్లో ఉన్నాయి. నాకు ఎంఎస్ రాజు గారు మెంటార్.  ప్రశ్న: హీరోగానే చేయాలనుకుంటున్నారా? రోహన్: అలా ఏం లేదండీ. నటుడిగా అన్ని తరహా పాత్రలు చేయాలని ఉంది. కథలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉందంటే... చేస్తా.

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రోహన్ మీడియాతో ముచ్చటించారు.  ప్రశ్న: మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి? రోహన్: మా తల్లిదండ్రులు ఇద్దరిదీ గుంటూరు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ పైలట్. అందువల్ల, చిన్నతనం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగా. పాన్ ఇండియా చైల్డ్ అనుకోండి. హైదరాబాద్‌లోనూ చదివా. ఫ్రాన్స్‌లో స్కాలర్షిప్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ & రోబోటిక్స్‌లో బ్యాచిలర్…

కాలేజీ నుంచి రాజకీయ ప్రవేశం వరకూ… కొండా మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ

కాలేజీ నుంచి రాజకీయ ప్రవేశం వరకూ... కొండా మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే 'కొండా' సినిమా : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: మీరు ఇంతకు ముందు తీసిన కథలకు, ఈ కథకు వ్యత్యాసం ఏంటి? ‘కొండా’ సినిమా తీయడానికి మీకు స్ఫూర్తి ఏంటి? విజయవాడలో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది. నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు.…

‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్ ..జూన్ 24న గ్రాండ్ రిలీజ్

"సాఫ్ట్ వేర్ బ్లూస్" రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్ ..జూన్ 24 న గ్రాండ్ రిలీజ్

శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్లూస్” అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు లక్షల లో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు దూల తీరపోద్ధిరా.. రే.. అనే డైలాగ్ ఉన్న ట్రైలర్ చూస్తుంటే చాలా హిలెరియస్ గా ఎగ్జైటింగ్ గా ఉంది. సాఫ్ట్ వేర్ లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా…

‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీ చిత్రం చూసి’ టీజర్ ఆవిష్కరణ

'మా' అధ్యక్షులు మంచు విష్ణు చేతుల మీదుగా 'నీ చిత్రం చూసి' టీజర్ ఆవిష్కరణ

మురళి, శివాని నాయుడు హీరో హీరోయిన్లుగా మహీంద్రా బషీర్ దర్శకత్వంలో MMK క్రియేషన్స్ బ్యానర్ పై మురళి మోహన్ .కే నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా “నీ చిత్రం చూసి”. ప్రేమ కథ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కి సతీష్ ముదిరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినయ్ శశిధర్ సంగీతం సమకూరుస్తున్నరు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంకి సంబందించిన “టీజర్ “ని ఇటివల,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షులు “శ్రీ మంచు విష్ణు”గారు Launch చేయగా,చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ,శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు (ఏపీ మాజీ మంత్రి కార్మిక శాఖ మంత్రులు) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గాలి శ్రీనివాస్ యాదవ్ గారు,ఈ చిత్ర సంగీత దర్శకుడు వినయ్ శశిధర్, ఎడిటర్ MNR, తదితరులు…

Mitsubishi Electric Initiates Semiconductor and Devices Lab Program : Covers 2 Technical institutions in the 1st Phase under it’s CSR Initiative

Mitsubishi Electric Initiates Semiconductor and Devices Lab Program : Covers 2 Technical institutions in the 1st Phase under it’s CSR Initiative

Mitsubishi Electric Initiates Semiconductor and Devices Lab Program Covers 2 Technical institutions in the 1st Phase under it’s CSR Initiative Faridabad, 14th June 2022: Mitsubishi Electric is a pioneer of Semiconductor technology and is a leading brand which is contributing towards the advancement of the society through its electrical and electronic products & solutions. The company works on a CSR Strategy which is in line with the Government of India initiatives and United Nations Sustainable Development Goals. The CSR initiatives adopted by the company can broadly be categorized as Skill…

‘అంటే సుందరానికీ’ తీసినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నాం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్‌ యెర్నని

'అంటే సుందరానికీ' తీసినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నాం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్‌ యెర్నని

‘అంటే సుందరానికీ’ మాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన చిత్రం. మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ‘అంటే సుందరానికీ’ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం.” అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్‌ యెర్నేని. నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..’అంటే సుందరానికీ’ విజయం…

`షికారు` నుంచి యూత్ ఫుల్ క్రేజీ సాంగ్ విడుద‌ల – జూన్ 24న సినిమా రిలీజ్‌

`షికారు` నుంచి యూత్ ఫుల్ క్రేజీ సాంగ్ విడుద‌ల - జూన్ 24న సినిమా రిలీజ్‌

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన షికారు నుండి `దేవ‌దాసు పారు వ‌ల్ల బ్యాడు` అనే క్రేజీ సాంగ్‌ను చిత్ర బృందం శ‌నివారంనాడు ఫిలింఛాంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విడుద‌ల‌చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌కుమార్‌, నిర్మాత వివేక్ కూచిభ‌ట్ట‌, ఆదిత్య మ‌హేంద్ర‌, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా న‌టుడు చ‌మ‌క్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం త‌ర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీక‌రించారు. అది నేను ఊహించ‌లేదు.…