Hero Naga Chaitanya who is riding high with consecutive hits will be joining forces with the ace director Venkat Prabhu for his 22nd film to be made grandly as a bilingual in Telugu and Tamil languages rich production values and first-class technical standards. Srinivasaa Chitturi will be producing this commercial entertainer on Srinivasaa Silver Screen banner, while Pavan Kumar presents it. Krithi Shetty will share the screen space with Naga Chaitanya in NC22 which is also the most awaited #VP11. The coming together of the gigantic three for this Telugu-Tamil…
Year: 2022
నాగ చైతన్య ద్విభాషా చిత్రం ఘనంగా ప్రారంభం
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు, కృతి శెట్టి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభమైన విశ్వక్ సేన్ చిత్రం
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్ కథానాయిక గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. తొలి షాట్ కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. వీరితో పాటు…
ఘనంగా ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ వేడుక
ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్. గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత బండ్ల గణేష్, హీరో సాయిరామ్ శంకర్, పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, దర్శకుడు పరశురామ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…జీవన్ దర్శకుడిగా సినిమా బాగా చేస్తావని నీ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయితో మంచి సినిమా చేయ్ అని చెప్పి ఆకాష్ ను నాతో పంపించారు పూరి జగన్నాథ్. ఆయన మాట నిలబెట్టుకుంటానని…
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ టీజర్ లాంచ్
శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…“పాటలు, టీజర్ చూశాక ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. అందరూ కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకంటున్నా. ఇంతకు ముందు ఆ నలుగురే నిర్మాతలు, వాళ్లే హీరోలు, వాళ్లవే థియేటర్స్ అన్నట్టు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తవాళ్లు…
‘గాడ్సే’ వంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం: నటుడు ప్రకాష్ నాగ్
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.పతా కంపై వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రకాష్ నాగ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది…
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదల
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదీలావుండగా ఈరోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సినిమా థియేట్రికల్ విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉంది. రానున్న రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ కు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్ గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్…
‘డ్యాన్స్ ఐకాన్’ అనే సరికొత్త షోతో వస్తున్నారు ఆహా, ఓక్ ఎంటర్‌టైన్మెంట్ : 22 జూన్ నుంచి ప్రారంభం కానున్న ఆడిషన్స్
నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రారా రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్ అని ఈ మధ్య పాడినా, డ్యాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి సమర్పిస్తున్న ‘డ్యాన్స్ ఐకాన్’ అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డ్యాన్స్ ఐకాన్ టైటిల్‌ను గెలుచుకోండి. జూన్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే,…
Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched
Leading production houses Sithara Entertainments and Fortune Four Cinemas are coming together to produce an action spectacle, headlined by Panja Vaisshnav Tej. The film’s muhurat ceremony was held at Ramanaidu Studio, Hyderabad at 11.16 am today amid the presence of the team and distinguished guests. Actress Sreeleela has been roped in as the female lead for the project. First-time filmmaker N Srikanth Reddy, who has written the story, will direct the film, tentatively titled #PVT04. Filmmaker Trivikram, Haarika and Hassine Creations founder S Radha Krishna, actor Sai Dharam Tej, director…
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం *కథానాయికగా ‘శ్రీ లీల‘ *దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం *ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం, సంభాషణలు, నేపథ్య సంగీతం పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దుకోనున్న చిత్రం నేడు ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16 నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్…
