డిసెంబర్ 23న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ’18 పేజీస్’ విడుదల

18pages movie

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్…

యన్టీఆర్ అవార్డ్ కు ఎంపికైన అలనాటి అందాలతార, నర్తకి ఎల్. విజయలక్ష్మి : 50 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు..

NTR AWARD : L VIJAYALAKSHMI

బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. ముఖ్యంగా అలనాడు అమె సినిమాలో చేసిన నాట్యం ఇప్పటికీ పలువురు ఆదరణ పొందుతూనే ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. 50 సంవత్సరాల తర్వాత…

‘ERROR500” టీజర్ ని విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

'ERROR500'' teser relese

మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500”. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘ERROR500” చిత్రం టీజర్ ని విడుదల చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు. జస్వంత్…

ఈ నెల 28న ఆహా లో ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’

andharubagundali andhulo nenundali

  ‘అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి’ : ఎస్‌.వి. కృష్ణారెడ్డి మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేసి తెరకెక్కించిన యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్‌, టీజర్‌ను ఘనంగా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్‌ కామెడియన్‌ బ్రాహ్మానందం చేతుల మీదుగా ‘అందరూ బాగుండాలి…

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు * కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. * అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు. ** సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. * టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు…

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న ‘కాంతార’..

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న 'కాంతార'..

కంటెంట్ ఈజ్ కింగ్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది కాంతార సినిమా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. లీడ్ పెయిర్ నటన.. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక టెక్నికల్ టీమ్ అయితే కాంతారకు ప్రాణం పోశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచి కాంతార సినిమా…

‘ఆహా..’ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి!

andharooBangundali andhulo nenundali

‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’… రాబోతున్న ఈ వింటర్ కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి అహా వారు అందించబోతున్న సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి సూపర్ స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించబోతున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ తల పండిన నిర్మాతనో తీయలేదు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను నెలకొల్పి అలీ ఈ మంచి చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పైగా ఈ కథలో నరేష్ – పవిత్రా లోకేష్ జంటగా కనిపించబోతున్నారు. ఇద్దరి మధ్య మరోసారి…

చిరంజీవి మెగా154 ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి విడుదల

mega 154 vaaltheru veeraiah

మెగాస్టార్ చిరంజీవి మెగా154 మేకర్స్ దీపావళికి ముందు విడుదల చేసిన మెగా154 గ్లింప్స్ ఒక మెరుపులా వచ్చి దీపావళి బ్లాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. సినిమా టైటిల్ టీజర్‌ ను విడుదల చేయడంతో ఎదురుచూపులకు తెరపడింది. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి సినిమాల నుండి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేశారు దర్శకుడు బాబీ. టైటిల్ టీజర్ లో.. భారీ ఓడలో కూర్చున్న విలన్ .. ” ఏంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఎడ్రా మీ అన్నయ్యా .. సౌండే లేదు” అన్న వెంటనే ఒక భారీ బ్లాస్టింగ్ సౌండ్ తో…

‘షరతులు వర్తిస్తాయి’ యూనివర్సల్ పాయింట్ : మామిడి హరికృష్ణ

sharathulu varthisthayi movie

స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం లో, చైతన్య రావ్, భూమి శెట్టి ప్రధాన పాత్రదారులుగా,నాగార్జున్, శ్రీష్, కృష్ణకాంత్ నిర్మాతలుగా, కుమారస్వామి (అక్షర కుమార్) రచన – దర్శకత్వం లో, ఒక అర్బన్ టౌన్ సెటప్ లో వాస్తవికతను అద్దం పడుతూ జరిగే ఒక కుటుంబ కథాచిత్రంగా త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఈ దీపావళి సందర్భంగా గౌ. శ్రీ డా.మామిడి హరికృష్ణ (తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్, కవి , సినీ విమర్శకులు, చరిత్ర కారులు) చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ క్యాచీ టైటిల్ , యూనివర్సల్ ఎలిమెంట్స్ తో నాణ్యమైన కథ, నైపుణ్యంతో కూడిన చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం పక్కాగా అన్ని వర్గాల వారిని అలరింపచేస్తుందని పేర్కొంటూ అందరకి దీపావళి శుభాకాంక్షలు…

‘టిక్ టాక్’ ను మరిపించేలా యువ ట్యాలెంట్ ను ప్రోత్సహించడానికి “ME 4 Tic Tic” యాప్ వచ్చింది!

'టిక్ టాక్' ను మరిపించేలా యువ ట్యాలెంట్ ను ప్రోత్సహించడానికి "ME 4 Tic Tic" యాప్ వచ్చింది!

ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం “టిక్ టాక్” ను బ్యాన్ చేసింది. ఆ తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి మరో ఆల్టర్నేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” సంస్థ వారు “ME 4 Tic Tic” యాప్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖులు మరియు యువత సమక్షంలో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. టిక్ టాక్ లేక ఇబ్బంది పడుతున్న ట్యాలెంటెడ్…