చిత్రం :1948 అఖండ భారత్
విడుదల తేది : 12, ఆగస్టు- 2022
రేటింగ్ : 3.5/5
తారాగణం:
డా.ఆర్య వర్ధన్ రాజ్ – నాథురాం గోడ్సే
రఘనందన్ – గాంధీ
సమ్మెట గాంధీ – అబ్దుల్ గఫార్ ఖాన్
జెన్నీ – జిన్నా
ఇంతియాజ్ ఆలీ – నెహ్రు
శరద్ దద్భవాల – వల్లభాయ్ పటేల్
సుహాస్ – విష్ణు కర్కరే
దుర్గాప్రసాద్ – నారాయణ ఆప్టే
నవీన్ మాదాసు – మదన్ లాల్ పహ్వ
నాగరాజు నన్నపనేని – డా .పర్చూరేయ్
తదితరులు ముఖ్యపాత్రధారులు .
దర్శకత్వం : ఈశ్వర్ బాబు – డి
నిర్మాత : ఎం . వై .మహర్షి
కథ : డా.ఆర్య వర్ధన్ రాజ్
కధనం : డా .ఆర్య వర్ధన్ రాజ్
సంభాషణలు : డా .ఆర్య వర్ధన్ రాజ్
పరిశోధన : డా. ఆర్య వర్ధన్ రాజ్
తారాగణం :
డా.ఆర్య వర్ధన్ రాజ్ ,సమ్మెట గాంధీ
రఘనందన్ తదితరులు
సంగీతం – ప్రజ్వల్ క్రిష్
సినిమాటోగ్రఫీ – ఎస్ .ఆర్ .చంద్ర శేఖర్
నేపధ్య గానం – శశి ప్రీతం
గీత రచన – డా .ఆర్య వర్ధన్ రాజ్
కూర్పు – రాజు జాదేవ్
నిర్మాణ సంస్థ – ఎం .వై.ఎం క్రియేషన్స్
1948 – అఖండ భారత్ ( మర్డర్ ఆఫ్ మహాత్మ అనేది ఉపశీర్షిక ) చిత్రం మహాత్మ గాంధీ హత్యా నేపధ్యంలో ,చారిత్రాత్మక సంఘటనలను ఆధారంగా చేసుకొని గాంధీ హత్యపై పూర్తి స్థాయి సమాచారంతో ,సమగ్రంగా ,చారిత్రాత్మక కోణంలో గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుండి జరిగిన యధార్థ వాస్తవాల ఆధారంగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి డా.ఆర్య వర్ధన్ రాజ్ , కథ,కధనం ,మాటలు ,రీసెర్చ్ లను అందజేయగా, నూతన దర్శకుడు ఈశ్వర్ బాబు. డి దర్శకత్వం వహించారు. సుమారు 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ఎం.వై .మహర్షి ఈ చిత్రాన్ని ఎం.వై .ఎం క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. డా.ఆర్య వర్ధన్ రాజ్ ,నాథురాం గోడ్సే గా ,రఘనందన్ గాంధీ గా ,సమ్మెట గాంధీ ,అబ్దుల్ గఫార్ ఖాన్ లుగా ముఖ్య పాత్రలు పోషించగా ,సుమారు 92 మంది క్కారెక్టర్ ఆర్టిస్టులు ఇతర పాత్రలలో నటించారు.నాథురాం గోడ్సే కోర్ట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ను చిత్రించిన తీరు అభినందిచదగ్గది గా విమర్శల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం భారత సినీ రంగ చరిత్రలోనే గాంధీ హత్యపై వచ్చిన పూర్తి నిడివి చారిత్రాత్మక చిత్రం గా చెప్పవొచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్న ఈ నేపథ్యంలో ఇది మరొక ప్రయోగాత్మక చిత్రం ‘1948 అఖండ భారత్’ (1948 Akhanda Bharath) అనే టైటిల్ తో సినిమా వస్తుందంటేనే భారతీయుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అన్ని భారతీయ బాషలతోపాటు, ముఖ్యమైన అంతర్జాతీయ భాషల్లోనూ విడుదలై అందర్నీ ఆలోచనలో పడేసింది. గాంధీ హత్యోదంతంపై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశ విభజన వల్ల భారతదేశం భౌగోళకంగా… ఆర్థికంగా… సామాజికంగా…. సాంస్కృతికంగా చిన్నాభిన్నమైనది. అందుకు కారణం అప్పటి బ్రిటీష్ పాలకులు ఓ కారణం కాగా… మరో వైపు అప్పటి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు. వారితో పాటు అహింసా వాది అయిన జాతిపిత గాంధీ. శాంతి… శాంతి అంటూ ఓ వైపు పాకిస్తాన్ కి వంత పాడటం వల్ల ఆయన ప్రాణాలనే వొదలాల్సి వచ్చిందని గాడ్సే వాదుల వాదన. 1948 అఖండ భారత్ లో రచయిత ఇందులో అదే చూపించారు. అహింసా వాది, సత్యాగ్రహి అయిన గాంధీ హత్యకు 45 రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, ఆయన మరణానంతరం జరిగిన ఇన్వెస్టిగేషన్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. గాంధీ హత్య కేసులో ఊరి తీయబడ్డ నాధు రామ్ గాడ్సే, నారాయణ అప్టేల మృత దేహాలను దహనం చేసిన ప్లేస్ లో అమర వీరుల స్తూపాలు నిర్మిస్తారని భావించి, ఎవరికీ తెలియకుండా దహనం చేయడం లాంటి భావోద్వేగ అంశాలు ఎంతో హృద్యంగా తెరపై చూపించాడు దర్శకుడు. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని మూలన పడిన సంఘటనలు ఈతరం యువతకి తెలిసేలా వుంది
ఎవరెలా చేశారంటే..
ఈ ‘1948 అఖండ భారత్’ చిత్రంలో గాంధీ పాత్రలో రఘనందన్ (Raghu Nandhan) విశేషంగా ఆకట్టుకున్నాడు.తన హావ భావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా కుదిరాయి. ఈ క్యారెక్టర్ లో రఘనందన్ ను చూసిన ప్రేక్షకులు వాహ్.. రఘనందన్ అని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇక కీలక రోల్ నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్(Arya Vardhan Raaz) మెప్పించాడు. ఎందుకంటే ఈ పాత్రకి గాంధీ లాగ పెద్దగా రిఫరెన్స్ కూడా మనకి చరిత్రలో కనిపించవు. గాంధీని హత్య చేసిన హంతకుడిలాగే మనం చదవడం కానీ, వినడం కానీ చేశాం. ఇందులో అయితే గాడ్సే ఓ అభ్యుదయ భావాలు వున్న బ్రాహ్మణ యువకునిగా గాడ్సే ఎంత అగ్రెసివ్ గా ఉండేవారో ఆర్య వర్ధన్ రాజ్ బాగా చేసి చూపించారు అందం కంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అంతే కాదు.. క్లైమాక్స్ కోర్ట్ సీన్ లో భావోద్వేగంతో చెప్పిన డైలాగులు చాలా కన్వెన్సింగ్ గా వున్నాయి. నారాయణ అప్టే పాత్రధారి బాగా ఆకట్టుకున్నాడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా మొహమ్మద్ ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయా పాత్రల్లో వాళ్ళు చూపిన హావభావాలు, నటనలో ఎంతో అనుభవం ఉన్న నటులను తలపించాయి.
ఇక దర్శకుడి విషయానికొస్తే.. ఆర్య వర్ధన్ రాజ్ ఎంతో రీసెర్చ్ చేసి రాసిన కథ, కథనాలను దర్శకుడు ఈశ్వర్ డి.బాబు తెరమీద బాగా చూపించారు. ఎక్కడా తొట్రుపాటుకు గురిఅవ్వకుండా దర్శకుడు ఈశ్వర్ డి.బాబు సినిమాను తెరకెక్కించిన విధానం మనసుల్ని గెలుచుకుంటుంది. ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం బాగుంది. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ ఎంతో రిచ్ గా వుంది. 1948 నాటి పరిస్థితులను బాగా చిత్రీకరించారు. అందుకు తగినట్టుగా ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత ఎం. వై. మహర్షి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. సినిమా అంటే… ఎలా ఉండాలి అనిపిస్తుంది.
మూలకథ: గాంధీహత్యకు 45 రోజుల ముందు నుండి జరిగిన యదార్ధ సంఘటనలూ ,గాంధీ హత్య ,హత్యానంతరం పరిణామాలు,హత్యానంతరం నిందితుల గాలింపు,ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ మరియు నాథురాం గోడ్సే కోర్ట్ వాదన,గోడ్సే ఉరితీత ,కోర్ట్ వాఘ్మూలాన్ని నిషేధించడం,అప్పటి ప్రభుత్వపు నాటకీయ పరిణామాల నేపథ్యంతో మూలకథ ముడిపడివుంటుంది.
కథ : గాంధీని ఎవరు చంపారు అన్నది అందరికి తెలుసు,కానీ ,ఎందుకు ? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది ? దానికి గల కారణాలు ఏంటి ? అనే విషయాలు,గోడ్సే తన కోర్ట్ స్టేట్మెంట్ లో 150 పాయింట్స్ గా చెప్పినా అప్పటి ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుండి బయటకు రానివ్వకుండా నిషేదించింది.అతి కిరాతకంగా గోడ్సే శవాన్ని ,దహనం చేసిన ప్రదేశం సైతం ఎవ్వరికి తెలీకుండా అతని చరిత్రని ముగించడం కోసం చేసిన కుట్రలూ ,అతని ప్రతిష్టని దిగజార్చిడానికి పన్నిన కుటిల రాజకీయాల నేపథ్యంలో గత 74 సంవత్సరాలుగా దాచిపెట్టబడిన నిజాలను వెలికితీసే అంశాలతో అల్లుకున్నటువంటి చారిత్రాత్మక కధగా ,యీ చిత్రానికి కథను అందించిన డా.ఆర్య వర్ధన్ రాజ్ ఒక సమావేశం లో చెప్పారు.
రీసెర్చ్ : సుమారు 11372 పేజీల రీసెర్చ్ పేపర్స్ ,300 కు పైగా పుస్తకాలు ,15 వేల కిలోమీటర్లు తిరిగి, 750 కు పై చిలుకు వ్యక్తులను కలిసి ,రెండు సంవత్సరాలు కష్టపడి,యధార్థ సంఘటనల ఆధారంగా 152 సీన్స్ తో బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చెయ్యడం జరింగిందని ,1948 ని మళ్ళీ రీ క్రియేట్ చెయ్యడానికి 700 ప్రాపర్టీస్ ని తయారుచెయ్యడమే కాకుండా ,500 కు పైగా కాస్ట్యూమ్స్ ను పూర్తిగా ఖాదీ వస్త్రాన్ని మాత్రమే వుపయోగించి డిజైన్ చేశామని చిత్రబృందం తెలిపింది.
చిత్రీకరణ : ఎం . వై. ఎం క్రియేషన్ పతాకంపై ఎం.వై .మహర్షి ఈ చిత్రాన్ని నిర్మించారు.యీ చిత్రం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను,జహీరాబాద్ ,నారాయణఖేడ్,జరాసంగం పరిసర ప్రాతంలో మూడు షెడ్యూల్స్ ను,ప్రత్యేకంగా వేయబడిన సెట్స్ లో నాలుగు షెడ్యూల్స్ ను ,మరల హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ తో 2021 లో చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2022 లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కు పంపగా వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి,బొంబాయ్ లో గల ముఖ్య కార్యాలయానికి అప్లికేషను ను బదిలీ చెయ్యగా ,అక్కడ CBFC వారు 15 మందితో కూడిన స్పెషల్ విజిలెన్సు కమిటీ ని వేసి ,పూర్తి వివరణలను తీసుకున్న పిదప U /A సెన్సార్ సర్టిఫికెట్ ను ఇచ్చారు .పాటలు – ఈ చిత్రం లో ఒకే ఒక పాట ఉండగా ,అది గాంధీని చంపే సమయంలో ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది.యీ పాటను గులాబీ ఫేమ్ శశి ప్రీతం స్వరపరచి ,ఆలపించారు. చివరగా చెప్పాల్సిందేమిటంటే.. ‘1948 అఖండ భారత్’ ప్రతీ భారతీయుడు చూసి గర్వపడాల్సిన సినిమా.