శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా.. విజయమిత్ర దర్శకత్వంలో ‘100 డేస్ లవ్ స్టోరీ’అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘అతి ప్రేమ భయానకం’ అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాత సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘100 డేస్ లవ్ స్టోరీ’ చిత్రం ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉంది. ట్రైలర్ ని చూస్తే చక్కటి ప్రేమకథలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి క్యాప్షన్ గా ‘అతి ప్రేమ భయానకం’ని పెట్టడంలోనే సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు అన్నారు. ప్రస్తుతం ప్రేమ పేరుతో సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. యువత ప్రేమ మోజులో జీవితాలను కోలోతున్నారు. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన యువతరం విచ్చలవిడి అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యువత మేల్కోవాల్సిన అవసరం ఉంది అని నిర్మాత సాయి వెంకట్ పేర్కొన్నారు. హీరో జయ శివ సూర్య మాట్లాడుతూ.. నన్ను చూసిన అందరూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లా ఉన్నానని చెబుతుంటే ఎంతో ఆనందమేస్తోంది. నన్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పోల్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరును తీసుకొస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిచిన విజయ్ మిత్ర మాట్లాడుతూ… ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తోన్న చిత్రాలకు భిన్నంగా ఈ ‘100 డేస్ లవ్ స్టోరీ’ తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షలు మెచ్చే అంశాలు మనకు ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించి హృదయాలను హత్తుకుంటాయి. సన్నివేశాలన్నీ ఆద్యంత ప్రేక్షకులు మనసులను దోచుకుంటాయన్న నమ్మకం నాకుంది. ఈ సినిమా దర్శకుడిగా నాకు, హీరోగా జయ శివ సూర్య, నిర్మాతగా పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ గార్లకు మంచి పేరుని తెచ్చిపెడుతుందన్న నమ్మకం నాలో బలంగా ఉందన్నారు. నిర్మాత పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న లవర్స్ డే కు ఒకరోజు ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. హీరోయిన్ నిఖిత శ్రీ మాట్లాడుతూ.. కథానాయికగా ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్ గా ఇషా మనోహరి ప్రియ, ఖబర్దస్ట్ అప్పారావు, ఆకెళ్ళ గోపాల క్రిష్ణ, కుమరన్ శేతురామన్, పి.వి.ఆర్ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి డీఓపీ : శేషు డి.నాయుడు, సంగీతం : తరుణ్ రాణాప్రతాప్, ఎడిటింగ్ : ఎస్.ఎఫ్.ఎక్స్ : శ్యామ్ కుమార్, డిజైన్స్, గ్రాఫిక్స్ :ఖ్యాతి విజ్యవల్స్ పీఆర్వో : బాబు నాయక్.
‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల
