చదువు అయిపోగానే ఉద్యోగం దొరకడం అనేది నేటి పరిస్థితిలో కష్టతరం. కానీ హోటల్ మేనజిమెంట్ చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ కష్టాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. వారికి చదువుతో పాటే ఉద్యోగ మెలుకువలు, చివరి సంవత్సరంలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్. భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉండే కోర్సులలో హోటల్ మేనజ్ మెంట్ కోర్స్ ఒకటి. మరీ అలాంటి కోర్సును అందిస్తున్న విద్యాసంస్థ హైదరాబాద్ లో హబ్సిగూడలోనే ఉంది. ఉస్మానియ యూనివర్సిటీ విభాగంలో దాదాపు 23 సంవత్సరాల అనుభవంతో వేలాది మంది విద్యార్థల భవిష్యత్తును తీర్చిద్ది ప్రపంచానికి వందాలాది చెఫ్ లను అందించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరి ఆర్ట్స్ (IIHMCA) విభాగంతో హబ్సీగూడలోని సంస్థ భారతదేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ప్రముఖ “అవుట్ లుక్ ఇండియ” (Outlook India) మ్యాగజెన్ ఈ వార్తను ప్రచురించింది.
బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ లో (BHMC) బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ కల్నరీ ఆర్ట్స్ (BCTCA) చాలా ప్రత్యేకమైన కోర్స్. ఈ రెండు కోర్స్ లను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరి ఆర్ట్స్ (IIHMCA) హబ్సీగూడ బ్రాంచ్ అందిస్తుంది. ఓయూ (OU) అఫ్లికేటెడ్ గా 2001లో హబ్సిగూడలో కేవలం 26మందితో మొదలైన ఈ సంస్థ ఏటా 300 నుంచి 400 మంది యంగెస్ట్ చెఫ్ లను అందిస్తుంది. యువ చెఫ్ లను తయారు చేయాలి అనే సంకల్పంతో సురజ్, గౌతమ్ లు తమ స్నేహితులతో నెలకొల్పిన ఈ సంస్థ ఈ రోజు వేలాది మందిని హోటల్ స్టాఫ్ గా, చెఫ్ లు గా తీర్చిదిద్దింది. కల్కర్ ఆర్ట్స్ లో డిగ్రీ కోర్స్ ను ప్రవేశపెట్టారు. కల్కర్ ఆర్ట్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో ఒక స్పెషలైజేషన్ డిగ్రీ కోర్స్ ఇది. ఒక చెఫ్ అవడానికి కావాల్సిన పూర్తి సబ్జెక్ట్ ఈ కోర్సులో ఉంటుంది. మూడు సంవత్సరాల ఈ కోర్స్ లో విద్యార్థులు కిచెన్ కు సంబంధించిన పూర్తి సమచారాన్ని ఈ కోర్సులో నేర్చుకుంటారు. మూడు సంవత్సరాలుగా ఉండే ఈ కోర్సులో ప్రతీ సంవత్సరం సెలబస్ ఉంటుంది. ప్రాక్టీకల్స్ ఉంటాయి. ఇది ఒక యూనిక్ కోర్స్. అలా ప్రతీ సెమిస్టర్ విద్యార్థులు కల్నరీ కోర్స్ ను నేర్చుకుంటూ 6వ సెమిస్టర్ కల్ల వారు మాస్టర్స్ అవుతారు.
మొదట కేవలం కల్నరీ ఆర్ట్ ను మాత్రమే ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాల తరువాత BHMCT కోర్సును తీసుకున్నారు. ఇందులో హోటల్ ఫీల్డ్ కు సంబంధించిన మొత్తం కోర్సు ఉంటుంది. ఫ్రెంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్
ఈ సంస్థలో రెండు డిగ్రీలు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ(BHMCT) . బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ కల్నరీ ఆర్ట్స్(BCTCA). ఈ రెండు డిగ్రీలు మొత్తం 3 సంవత్సరాల కోర్స్. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు టోటల్ కమ్యూనకేషన్ అండ్ సబ్జెక్ట్ స్కిల్స్ తో హోటల్ ఇండస్ట్రిలోకి ప్రవేశిస్తారు. ఇవే కాకుండా స్టేట్ బర్డ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ అనుమతితో ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సులు కూడా ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో అందుబాటులో ఉన్నవి. ఈ కోర్సులో ఒక సంవత్సరం పాటు కల్కరీ బేసిక్స్ శిక్షణ ఉంటుంది. దీనితో పాటు 6 నెలలు ఇండస్ట్రీ ట్రైనింగ్ కూడా ఉంటుంది.
ఈ ఇండస్ట్రి ట్రైనింగ్ లో విద్యార్థులు కిచెన్ ట్రైనింగ్ అవుతారు. కస్టమర్స్ నడుచుకోవాల్సిన మెలుకువలు, మొత్తం ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. దీని తరువాత విద్యార్థులు జాబ్ లో చేరడం జరుగుతుంది.
అలాగే డిగ్రీ కోర్సులో కూడా 4 నెలలు ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది. అది 4వ సెమిస్టర్ లో ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో భాగంగా డిపార్ట్ మెంట్ వైజ్ గా అంటే ఫ్రెంట్ ఆఫీస్, ఫుడ్ సర్వీస్, హూస్ కీపింగ్, అండ్ ఫుడ్ ప్రొడక్షన్ లలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. అయితే కల్నరీ ఆర్ట్స్ స్టూడెంట్స్ మాత్రం కేవలం ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో మాత్రమే ఇండస్ట్రి ట్రైనింగ్ ఉంటుంది. మాములుగా హోటల్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ స్టూడెంట్స్ మాత్రం అన్ని డిపార్ట్ మెంట్ లో వారికి నచ్చిన దాంట్లో ట్రైనింగ్ తీసుకోవచ్చు. అలా 4 నెలలు చేయి తిరిగిన చెఫ్ ల దగ్గర వర్క నేర్చుకొని వస్తారు. ఆ తరవాత వారు ఏ డిపార్ట్ మెంట్ లో జాయిన్ కావాలంటే అందులో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు.
హబ్సీగూడాలో ఉన్న ఈ ఇనిస్టిట్యూట్ లో విద్యార్థులు ఎక్స్ పెరిమెంట్స్ చేయడానికి వీలునన్ని కిచెన్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నావి. వీటిలో విద్యార్థులకు పూర్తిగా ప్రత్యేక్ష శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఈ కోర్సులో మొత్తం ప్రాక్టికల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందరి విద్యార్థులకు సరిపడ కిచెన్స్ అందుబాటులో ఉన్నవి.
ప్రతీ సంవత్సరం 6వ సెమిస్టర్ మొదలైనప్పటికే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ప్రారంభం అవతాయి. కల్నరీ ఆర్ట్స్ కు సంబంధించి మన దేశంలోనే చాలా తక్కువ కాలేజీలు శిక్షణ ఇస్తున్నాయి. అందులో భాగంగా స్టార్ హోటల్స్, క్రూజ్, షిప్స్ లో చెఫ్ లుగా కల్నరీ స్టూడెంట్స్ కు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక BHMCT స్టూడెంట్స్ కు దేశ విదేశాల్లో ఉన్న హోటల్స్ లో ఉద్యోగం పొందవచ్చు. కల్నరీ స్టూడెంట్స్ కు సంబంధించి క్రూజ్ షిప్స్ లలో దాదాపు 40 నుంచి 50 మంది స్టూడెంట్స్ కు ప్లేస్ మెంట్స్ పక్కగా వస్తున్నాయి. ఈ సంస్థతో “పీ&ఓ క్రూయిజెన్, కోస్టా, ఎమ్మెస్సీ క్రూయిజెన్ వంటి అంతార్జాతీయ క్రూయిస్ లైనర్లు అలాగే తాజ్ గ్రూప్ హోటల్లు, ఒబెరాయ్స్ హోటల్స్, ఐటీసీ, జుమెరా బీచ్ హోటల్స్” వంటి వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇనిస్టిట్యూషన్ కు ఉన్న అనుబంధం మూలంగా ప్రతీ ఏట వీరి క్యాంపస్ నుండి విద్యార్థులకు ప్లేస్ మెంట్స్ కలిపిస్తున్నాయి.
IIHMCA Institutes గురించి చెప్పాలంటే విద్యార్థుల జీవితాలకు భరోసా ఇచ్చీ 100 శాతం క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ను కల్పిస్తుంది. మంచి అనుభం గల కాలేజీ ప్రిన్సిపల్ “గౌతమ్ కరింగి” విద్యార్థులను లక్ష్యం దిశగా ప్రయాణించే ప్రోత్సహాన్ని నింపుతుంటారు. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీలు ముఖ్యంగా “సురజ్ పులి” లాంటి సీనియర్ ఫ్యాకల్టీలచే విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు హోటల్ ఫీల్డ్ లో అభిరుచి ఉంటే ఒక్కసారి అబ్సీగూడలోని ఈ ఇనిస్టిట్యూట్ ను సందర్శంచండి.