సెప్టెంబర్ 16న ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’

Aadi Saikumar, Sri Sathya Sai Arts, Phani Krishna Siriki’s Crazy Fellow Releasing In Theatres Worldwide On September 16th
Spread the love

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘క్రేజీ ఫెలో’.
క్రేజీ ఫెలో నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘క్రేజీ ఫెలో’గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది.
ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్ర ప్రోమోషన్స్ ను దూకుడుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.
తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్
సాంకేతిక విభాగం:
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత : కేకే రాధమోహన్
రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి
సంగీతం : ఆర్ఆర్ ద్రువన్
డీవోపీ: సతీష్ ముత్యాల
ఆర్ట్ : కొలికపోగు రమేష్
ఎడిటర్: సత్య గిడుతూరి
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్
ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను)
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజైనర్ : రమేష్ కొత్తపల్లి

Related posts

Leave a Comment