‘సెన్సిటీవ్’ చిత్రంలోని ‘దోస్త్ మేరా దోస్త్..’ పాట విడుదల

sencitvie telugu movie song relesed
Spread the love

R.K.S నిర్మాతగా మాస్టర్ అబ్రర్, మాస్టర్ రీహెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సెన్సిటీవ్. పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అంకితమై అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొబైల్ గేమ్ లలో లీనమై స్టూడెంట్స్ ఆత్మ హత్యలకు పాల్పడిన సంధర్భా లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సరైన ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలోని మొదటి పాట దోస్త్ మేరా దోస్త్ లిరికల్ సాంగ్ ను హీరో సంపూర్ణేష్ బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ…పిల్లలకు చక్కటి సందేశం ఇస్తూ నిర్మించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత: ఆర్.కె.ఎస్
డైరెక్టర్: కొరియోగ్రఫీర్ ఆర్.కె మాస్టర్ (రామకృష్ణ)
స్పెషల్ రోల్: చలాకి చంటి
ఎడిటింగ్: ఈశ్వర్
కెమెరామెన్: రమేష్ సిద్ధం
సంగీతం: ఎంఎల్.రాజా ప్రాణవ్ దాశరధి
లిరిక్స్: కార్తిక్ నడిమింటి, ఎస్.బి.గీతావాణి
సింగర్: మయుఖ్ వడపలని
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Related posts

Leave a Comment