సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల

Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love
Pedhavulu Veedi Maunam, a new melody from Takkar, starring Siddharth, Divyansha Kaushik, is an ode to love
Spread the love

– ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట
– ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’ సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘పెదవులు వీడి మౌనం’ అనే సాంగ్ విడుదలైంది.
‘పెదవులు వీడి మౌనం’ లిరికల్ వీడియోని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నివాస్ కె ప్రసన్న స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ కట్టిపడేస్తోంది. “పెదవులు వీడి మౌనం.. మధువులు కోరే వైనం.. తనువులు చేసే స్నేహం.. నేడే…” అంటూ సాగిన పాట ప్రేమ మైకంలో ముంచేసేలా ఉంది. ఆ పాట మూడ్ కి సందర్భానికి తగ్గట్టుగా నివాస్ కె ప్రసన్న ఎంత చక్కగా స్వరపరిచారో.. కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం కూడా అంతే చక్కగా కట్టిపడేసేలా ఉంది. తేలికైన పదాలతో లోతైన భావాలను పలికించారు కృష్ణ కాంత్. దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద ఎంతో అందంగా ఈ పాటను ఆలపించి, తమ మధుర గాత్రంతో మాయ చేశారు. ఇక నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని, వెండితెరపై ఈ జోడి మ్యాజిక్ చేయబోతోందని ఈ లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్