ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘జాతి రత్నాలు’లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ ‘జాతిరత్నాలు’ సినిమాతో మరింత దగ్గరైంది. ఒకే ఒక్క సినిమా ‘జాతి రత్నాలు‘తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘బంగార్రాజు‘ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ! ఇప్పుడు సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా చేయబోతుంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ లో మొదలవుతుంది. ఇంతకు ముందు మేర్లపాక గాంధీ రాసిన ‘ఏక్ మినీ స్టోరీ’ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కి గాంధీ డైరెక్షన్ లో చేయడం ఇదే మొదటిసారి! ‘శ్యామ్ సింగరాయ్‘ సినిమాతో హిట్ అందుకున్న వెంకట్ బోయినపల్లి ఈ చిత్ర నిర్మాత.
ఇదిలా ఉండగా ‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా సినీప్రియులకు దగ్గరైన తెలుగందం ఫరియా అబ్దుల్లా. ఆ చిత్రంతో తొలి అడుగులోనే చక్కటి విజయం అందుకుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి ఆ మధ్య వచ్చిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో అతిథి పాత్రలో మెరిసి మెప్పించింది. అయితే ఇప్పుడీ అమ్మడు నాగ్ ‘బంగార్రాజు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. నాగచైతన్య మరో హీరో. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పుడీ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో ఫరియా ఆడిపాడింది.