వైష్ణ‌వ్ తేజ్‌, క్రిష్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం కొండ‌పొలం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam
rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam
Spread the love

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ కొండ‌పొలం. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోమ‌వారం రోజున‌ ఈ చిత్రంలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ర‌కుల్ ఈ చిత్రంలో ఓబుల‌మ్మ అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది.
ర‌కుల్ లుక్‌ను రివీల్ చేస్తూ కొండ‌పొలం చిత్రం నుంచి ఓ సాంగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అడ‌విలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ప్రేమ‌తో, వెనుక నుంచి వైష్ణ‌వ్ కౌగించుకునే స‌న్నివేశం గ్లింప్స్‌లో క‌నిపిస్తుంది. వైష్ణ‌వ్‌, ర‌కుల్ జోడి స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. హాఫ్ శారీలో ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ చ‌క్క‌టి పాత్ర చేసిందని అర్థ‌మ‌వుతుంది. సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి త‌న మ్యూజిక్‌తో మ‌రోసారి మ్యాజిక్ చేశారు.
ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.8గా రూపొందిన అడ్వెంచ‌ర‌స్ మూవీ కొండ పొలంకు స‌న్న‌పురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల ఆధారం. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్‌ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.
బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌రికొంత ప్ర‌ముఖ ఆర్టిస్టులు న‌టించారు. ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న కొండ‌పొలం చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.
న‌టీన‌టులు:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి
ప్రొడ్యూస‌ర్స్‌: సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి
బ్యాన‌ర్‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌
క‌థ‌: స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి
ఎడిట‌ర్‌: శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేటి
ఆర్ట్‌: రాజ్ కుమార్ గిబ్స‌న్‌
కాస్ట్యూమ్స్‌: ఐశ్వ‌ర్య రాజీవ్‌