‘వృక్షవేదం.. మొక్కల నినాదం’ : దునియ విజయ్

Duniya-Vijay-Greenindia-challenge
Spread the love

“జగత్ ఏవమ్ అనౌషధం” అన్నారు పెద్దలు, అంటే ఈ సృష్టిలో ఔషధం కానిదంటూ ఏది లేదని పెద్దల మాట, అందులో ప్రధానమైన పాత్ర పోషించేవి మొక్కలు.. మనం మొక్కలను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ దునియ విజయ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీస్ కార్యాలయంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటిన విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మొక్కల ప్రాధాన్యతను, చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకువచ్చిన “వృక్షవేదం” పుస్తకం నాకు అమితాసక్తిని కలిగించింది. భవిష్యత్ తరాలకు మనం చేయాల్సింది ఇది కదా అనిపించింది. అంతేకాదు.. ఇంత చక్కటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నాటడమే కాదు.. నా ముగ్గురు స్నేహితులతో మొక్కలు నాటిస్తానని విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు రాఘవతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment