రామ్ విలాస్ పాశ్వాన్ కు భారతరత్న ఇవ్వాలి

ramvilas paswaan birtha day celebreations
Spread the love

-లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్
-హైదరాబాద్ లో ఘనంగా పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు

కేంద్ర మాజీమంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో సోమవారం ఘనంగా జరిగాయి. లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అహ్మద్ మునీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా మునీర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టీస్ అధ్యక్షుడు , ప్రముఖ హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ.. గొప్ప పార్లమెంటేరియన్ గా 40 ఏళ్ల పాటు సుదీర్ఘ చరిత్ర కలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని, అదే విధంగా 20 ఏళ్ల పాటు ఆరుగురు ప్రధానమంత్రుల దగ్గర క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన మహోన్నత నాయకుడు, సామాజికవేత్త , సంస్కరణ వాది రామ్ విలాస్ పాశ్వాన్ అని అన్నారు. తెలంగాణ హైదరాబాద్ లో పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని అందుకు లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ శాఖను ఆయన అభినందించారు. అణగారిన ప్రజలకోసం అహర్నిశలు పాటుపడ్డ సోషలిస్ట్ లీడర్, లోహియా శిష్యుడు రామ్ విలాస్ పాశ్వాన్ అని నాగుల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కు మూలాధారం పాశ్వాన్ అని , ఆయన మహోన్నత సేవలను గుర్తించి వెంటనే పాశ్వాన్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడుగా పాశ్వాన్ సేవలు మరచిపోలేమని భారతదేశ రాజకీయ నాయకుల్లో పాశ్వాన్ ది అరుదైన చరిత్ర అని, బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయన ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, చివరి వరకు ఆయన అణగారిన ప్రజలకోసమే తపించి పోయారని, ఆత్మ గౌరవం కోసం, కులరహిత, మతరహిత సమాజం కోసం నిరంతరం తపించిన అంబేడ్కర్ తర్వాత అంతటి సామాజిక స్పృహ కలిగిన మహోన్నతుడు రామ్ విలాస్ పాశ్వాన్ అని ఆయన కొనియాడారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘ జాతీయ నాయకుడు గొల్లేపల్లి దయానందరావు మాట్లాడుతూ కులరహిత, మతరహిత సమాజం అహర్నిశలు శ్రమించి, అదే దారిలో తుది శ్వాష విడిచేవరకు అణగారిన జనం కోసమే అసువులు బాసిన గొప్ప వ్యక్తి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ఆయన 75వ జయంతిని ఈ విధంగా జరుపుకుంటూ ఆ గొప్ప మహోన్నతుడిని స్మరించుకుంటున్నామని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, వారి ఆత్మ గౌరవం కోసం, అలాగే తెలంగాణ కోసం కూడా పాశ్వాన్ తపించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తన మద్దతు ప్రకటించారని అందుకే తెలంగాణాలోని హైదరాబాద్ లో పాశ్వాన్ విగ్రహం పెట్టాలని కోరారు. అందు కోసం తనవంతు సహాయాన్ని కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. సమాజానికి దశ-దిశ చూపించిన వ్యక్తి పాశ్వాన్ అని, ప్రజాస్వామ్యం అందరి సొత్తు అని నిరూపించిన ఆయన అదే దారిలో నడిచారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా జరిగిన పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకల్లో లోక్ జనశక్తి సెక్రటరీ జనరల్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు చెన్నయ్య, యస్సీ-ఎస్టీ అసోసియేషన్ ప్రసిడెంట్ పి.వెంకట రమణ, అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సి. హెచ్. బాలకృష్ణ, హైకోర్టు న్యాయవాదులు చింతల సాయిబాబా, బుర్ర సంపత్ కుమార్, సంపత్ కుమార్, రాచకట్ల కృష్ణ, లోక్ జనశక్త్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ అహ్మద్ , ప్రముఖ టి.ఆర్.ఎస్ నాయకులు ప్రభు గుప్తా, శంకరయ్య, మాజీ అధ్యక్షులు సలాం తదితరులు పాల్గొన్నారు. చివరగా లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అహ్మద్ మునీర్ వందన సమర్పణ చేశారు.

Related posts

Leave a Comment