ఆలేరు, జనవరి 29 : యువతరం క్రీడాస్ఫూర్తితో మెలిగినప్పుడే ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయని, ప్రతీ ఒక్క క్రీడాకారుడు ఆటల్లో మెరుగైన ప్రతిభను కనబరిచి ఇతర క్రీడాకారులకు మార్గదర్శిగా నిలవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ముగింపు క్రీడలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడల్లో పాల్గొన్న యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, యువకులంతా క్రీడాస్ఫూర్తితో నిలవాలనీ, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి మంచిపేరును తెచ్చుకోవాలని కోరారు. స్వయంగా తాను ఒక కబడ్డీ ఆటగాడినని, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో కూడా పోటీల్లో పాల్గొన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఏదైనా ఆటలో ఓ క్రీడాకారుడు పాల్గొన్నప్పుడు ఆ క్రీడాకారుడు ఇతర ఆటగాళ్లను ప్రోత్సహించి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని, ఆ ప్రదర్శనే ఆటగాళ్లకు ఉత్సాహాన్ని నింపి మరింత ముందుకు వెళ్లేలా చైతన్యాన్ని కలిగిస్తుందని బీర్ల ఐలయ్య అన్నారు.
ఈ బహుమతుల ప్రదానోత్సవంలో ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఎం.ఏ ఎజాజ్, ఎంపీపీ గందమల్ల అశోక్, కల్వకుంట్ల లోకేష్, సాయిగూడెం అధ్యక్షులు భీమగాని ప్రభు, బర్గ శీను, పరే రమేష్, ముద్దపాక నరసింహ, బడుగు జహంగీర్, సుంకర విక్రమ్, కాసుల భాస్కర్, మాక్సూద్, ఎం.డి జావీద్, మధు, వల్లెపు గణేష్ భజరంగ్ యూత్ అధ్యక్షులు సిససాయి ,వెంకటేష్, లక్కాకుల సంతోష్, కిరణ్, వైకుంఠం, భాను, సైది సాయి, భాను తదితరులు పాల్గొన్నారు.