మోహన్ లాల్ ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released
Spread the love

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జనవరి 18న రాజస్థాన్ లోని జై సల్మెర్ లో ప్రారంభమైన షూటింగ్ అక్కడే నిరాటకంగా కొనసాగుతోంది.
ఎన్నో అంచనాలున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ చిత్ర కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉండగా అవేవీ ‘ మలైకొట్టై వలిబన్’ కు సంబంధించినవి కావని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళం తో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నిటిలో విడుదల కానుంది. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ రఫిక్ స్క్రిప్ట్ వర్క్ అందిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతీష్ శేఖర్ పి ఆర్ ఓ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తెలుగు పబ్లిసిస్ట్ గా బి ఏ రాజు ‘s టీం పని చేస్తున్నారు.
రచయిత : పి ఎస్ రఫీక్
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
సినిమాటోగ్రాఫర్: మధు నీలకందన్
నిర్మాతలు : జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్
దర్శకత్వం : లిజో జోస్ పెల్లిస్సెరి
ప్రమోషన్ కన్సల్టెంట్: PRO ప్రతీష్ శేఖర్
PRO (Telugu) : బి ఏ రాజు’s టీం

Related posts

Leave a Comment