మెగాస్టార్ తో మరోసారి త్రిష!?

Megastar-Trisha
Spread the love

త్రిష మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట అంటూ సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో యువతరం దర్శకుడు వెంకీ కుడుముల ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చిరు – త్రిష జోడీ గతంలోనే ఒక సినిమా చేయాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఇప్పుడు ఈ జోడీ వెంకీ కుడుముల సినిమాలో కనిపింబోతుందట. మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కి స్తారట. కాగా మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ లాంటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే! మెగాస్టార్ సరసన మరోసారి త్రిష నటిస్తుందన్న విషయాన్ని మాత్రం మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు! అదీ.. విషయం!!

Related posts

Leave a Comment