మెగాస్టార్ కు ఐదు దశాబ్దాల స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారం

cinegoyer awards
Spread the love
  • రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, జయప్రదలకు స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారాలు
  • నేడు సినీగోయర్స్ ఫిలిం అవార్డ్స్- కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లకు జీవన సాఫల్య పురస్కారాలు

ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ సినిమా అవార్డ్స్ వేడుక శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదిక లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారని వారు వివరించారు. పాసులు ఉన్నవారికే ప్రవేశం అని, కోవిద్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి హాజరు కావాలని కోరారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అలనాటి తారలు జయప్రద, విజయశాంతి తదితరులు పాల్గొంటారని అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు డాక్టర్ పి.శ్రీధర్, బి.రామకృష్ణ తెలిపారు.

Related posts

Leave a Comment