మునుగోడు సమస్యలు తీర్చింది కేసీఆర్ మాత్రమే : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్

General news
Spread the love

రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన పద్మ శాలీ ‘ఆత్మీయ సమ్మేళనం’ లో మంత్రి కేటీఆర్ అభినందనలు అందుకున్నారు. ఈ సందర్బంగా కలిసిన మీడియా ప్రతినిధులతో పరమేశ్వర్ మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ గెలవదు అని తేల్చిచెప్పారు. కేంద్రంలో మోదీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. బీజేపీకి కేసీఆర్‌ భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గుజరాత్‌లో మోటార్లకు మీటర్లు పెట్టారు. గత ప్రభుత్వాలు మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపలేదు. ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌కు చెక్ పెట్టింది. నల్గొండ కాంగ్రెస్ నేతలు ఎదిగారు తప్ప అక్కడి సమస్యలు మాత్రం తీర్చలేదు. వ్యక్తుల ప్రాబల్యంతోనే గత ఉప ఎన్నికల్లో గెలిచారు తప్ప బీజేపీతో కాదు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ఆ స్థానంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో టచ్‌లో ఉన్నానని చెప్పటం దిగజారుడుతనమని నిప్పులు చెరిగారు. మునుగోడులో ఉన్న సమస్యలు తీర్చింది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి అవగాహన లేక మాట్లాడుతున్నాడు. పార్టీలో చేరతామని వస్తే ఆహ్వానించాల్సిందే అని చెప్పారు. దేశంలో మనువాదం తీసుకొచ్చి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు. బీజేపీని ఓడగొట్టేందుకు టీఆర్ఎస్ పోరాడుతుందని ఆయన ఉద్ఘాటించారు. అందుకే కమ్యూనిస్టులు మాతో కలిసి వస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ మాతో కలిసి పని చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజీనామాతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మటం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి. ఫలితం రాబోయే సాధారణ ఎన్నికలపై పడుతుంది. మునుగోడులో ఓడిపోతే పదవి నుంచి తీసివేస్తారనే భయం రేవంత్‌కు పట్టుకుంది. ఏడ్చే వారికి ఏం సమాధానం చెప్తాం. బీఆర్‌ఎస్‌తో తెలంగాణ అస్తిత్వానికి ఏం ప్రమాదం లేదు. వంద శాతం ప్రజల మద్దతు ఏ ప్రభుత్వానికి ఉండదు. మేము ఉద్యమంలో తెచ్చిన ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను పోల్చవద్దు అని ఆయన సూచించారు.

Related posts

Leave a Comment