‘మా’ ఎన్నికల్లో చిరు ఓటు ఎవరికి?

maa elections news
Spread the love

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్స్ వేయడం జరిగింది. మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పోటీతో మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. సినీ ప్రముఖులే కాకుండా.. సామాన్యులు సైతం మా ఎన్నికల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి.. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నాగబాబు ప్రకటించారు. అయితే.. చిరంజీవి మీడియా ముందుకు వచ్చి ప్రకాష్‌ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించలేదు. దీంతో నిజంగానే చిరు సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మంచు విష్ణు ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే.. చిరంజీవి అంకుల్ ఓటు తనకే అని విష్ణు ప్రకటించారు. త్వరలోనే తమ బృందం చిరంజీవిని కలుస్తామన్నారు. ఖచ్చితంగా ఆయన తమకు మద్దతు పలుకుతాడని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. తమ ప్యానెల్ మ్యానిఫెస్టో చూపించి, తాను ఏం చేయాలనుకుంటున్నానో వివరిస్తే చిరంజీవి ఓటు తనకే పడుతుందని మంచు విష్ణు అన్నారు. మా కోసం ఏం చేయాలనే విషయం పై తన దగ్గర పక్కాగా ప్రణాళికలు ఉన్నాయని విష్ణు చెప్పాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే మా కోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఇలా మంచు విష్ణు చిరు ఓటు తనకే అని ప్రకటించడంతో చిరంజీవి మద్దతు ఎవరికి ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Related posts

Leave a Comment