-జూకంటి సంపత్ (ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు)
(టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అన్నింటికీ నేను సైతం..అంటూ ముందుండి ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య పై టిఆర్ఎస్ నాయకులు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే దంపతుల ప్రోద్బలంతో పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి సంపత్ అన్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ .. గతంలో అంజుమన్ బ్యాంక్ (ప్రస్తుత సింగిల్ విండో) బ్యాంకు సిబ్బంది అప్పులు కట్టకుంటే గొంగిడి సునీత మహేంద్రారెడ్డి ఇంట్లో సామానులు బయట వేసిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోట్లాది రూపాయలు గొంగిడి సునీత దంపతులు ఎలా సంపాదించారో? టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆలేరు నియోజకవర్గంలో బినామీల పేరుమీద ఎకరాల భూమిని ఎలా సంపాదించారో టిఆర్ఎస్ నాయకులు చెప్పి తీరాల్సిందేనని జూకంటి సంపత్ డిమాండ్ చేశారు. గతంలో ఎం.ఎల్.ఏ గొంగిడి సునీత ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్, సర్పంచిగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్, మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్, రెండవ సారి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లను ప్రజల మధ్యలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకు మీరు సిద్ధమేనా? అని జూకంటి సంపత్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య పై ఇకపై ఆరోపణలు చేస్తే సహించమని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సంపత్ హెచ్చరించారు.