పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న బారీ చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అల్యూమినియం ప్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ టీజర్ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ రికార్డు రేటు ఇస్తామని ఏరియా రైట్స్ కోసం పోటీపడుతున్నారు. దీంతో బిజినెస్ లో ఊహించనంత క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఫస్టు గ్లింప్స్ లో రానా కనిపించకపోవడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానాకీ చోటు కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో సాధ్యమైనంత త్వరలోనే రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.